Popular Actress Lavanya Tripathi : అల‌రిస్తున్న లావ‌ణ్య చిత్తూరు పిల్ల

స‌తీ లీలావ‌తి సినిమా సాంగ్ రిలీజ్

Hello Telugu - Popular Actress Lavanya Tripathi

Hello Telugu - Popular Actress Lavanya Tripathi

Lavanya Tripathi : మెగా ఫ్యామిలీ కోడ‌లు , వ‌రుణ్ తేజ్ స‌తీమ‌ణి లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కీల‌క పాత్ర పోషించిన చిత్రం స‌తీ లీలావ‌తి. ఈ సినిమా షూటింగ్ అతి వేగంగా కొన‌సాగుతోంది. తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది ఈ మూవీ నుంచి. మూవీ మేక‌ర్స్ సినీ ఫ్యాన్స్ కోసం ఈ మూవీకి సంబంధించి ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు. త‌ను గ‌తంలో ప‌లు సినిమాల‌లో న‌టించింది. మంచి పాత్ర‌లు పోషించింది. ఆ త‌ర్వాత వెబ్ సీరీస్ లలో కూడా రోల్స్ పోషిస్తూ త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ పొందింది. త‌ను ప్ర‌ముఖ న‌టుడు వ‌రుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుంది. త్వ‌ర‌లోనే స‌తీ లీలావ‌తి మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తొలి సాంగ్ చిత్తూరు పిల్ల పాట విడుద‌లైంది. మంచి ఆద‌ర‌ణ పొందింది.

Lavanya Tripathi Movie Updates

లావ‌ణ్య‌తో పాటు దేవ్ మోహన్ మ‌రో రోల్ పోషించాడు. దీనిని ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ స‌మ‌ర్పిస్తోంది. దుర్గాదేవి బ్యాన‌ర్ పై నిర్మిస్తున్నారు స‌తీ లీలావ‌తి సినిమాను. తాతినేని స‌త్య ఈ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు. త‌ను గ‌తంలో పాపుల‌ర్ అయ్యాడు. భీమిలి క‌బ‌డ్డీ జ‌ట్టు, ఎస్ఎంఎస్ సినిమాల‌ను తీశాడు. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. ఈ చిత్రంలో ప్ర‌ధానంగా ద‌ర్శ‌కుడు ఒకే ఒక్క పాయింట్ ను ఫోక‌స్ చేశాడు. ఇందులో భార్య భ‌ర్త‌ల మ‌ధ్య బాండింగ్ ను తెర‌పై ప్ర‌దర్శించేలా చేశాడు. చిత్తూరు పిల్ల పాట‌ను ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత వ‌న‌మాలి ర‌చించారు.

కృష్ణ తేజ‌స్వి, రితేజ్ రావు, నూత‌న మోహన్ క‌లిసి గుండెల్ని మీటేలా రూపొందించారు. దీనిని బృందా మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీ చేశారు. చాలా బాగుందంటూ సినీ ప్రేమికులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. పెళ్లి ప్రాధాన్య‌త ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు మిక్కీ జే మేయ‌ర్ సంగీతం అందించారు.

Also Read : RGV Investigation – Phone Seize : 11 గంట‌ల‌కు పైగా ఆర్జీవీ విచారణ‌..ఫోన్ సీజ్

Exit mobile version