ముంబై : స్వంత గడ్డపై విజయం సాధించి పరువు కాపాడు కోవాలని అనుకున్న ముంబై ఇండియన్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 19వ సీజన్ లో ఆఖరి మ్యాచ్ లో ముంబైకి ఝలక్ ఇచ్చింది. అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రధానంగా బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడడు. తను తను 32 పరుగులు చేయడమే కాదు ముంబై జట్టును తన అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో దుమ్ము రేపాడు. ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీశాడు. దీంతో 14 మ్యాచ్ లకు గాను 8 మ్యాచ్ లలో విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంది.
దీంతో సన్ రైజర్స్ తో తాడో పేడో తేల్చుకోనింది. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది రాజస్తాన్ రాయల్స్. 30 రన్స్ చేడాతో ఓడించింది ముంబై ఇండియన్స్ ను. ముందుగా బరిలోకి దిగింది రాజస్థాన్. నిర్ణీత 20 ఓవరర్లలలో 206 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఏ కోశాన ఢీకొనలేక పోయింది. 9 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. తను 42 బంతులు ఆడి 3 ఫోర్లు 4 సిక్సర్లతో 60 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 34 , విల్ జాక్స్ 33 పరుగులు చేసినా గట్టెక్కించ లేక పోయారు.
