Popular Director Rajamouli Movie : 15న రాజ‌మౌళి గ్లోబ్‌ట్రాటర్ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ లాంచ్

ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సారం చేయ‌నున్న జియో స్టార్

Hello Telugu - Popular Director Rajamouli Movie

Hello Telugu - Popular Director Rajamouli Movie

Rajamouli : హైద‌రాబాద్ : దిగ్గ‌జ దర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి (Rajamouli) అలియాస్ జ‌క్క‌న్న ఏది చేసినా అది సంచ‌ల‌న‌మే. త‌ను ప్ర‌స్తుతం ప్రిన్స్ మ‌హేష్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో క‌లిసి గ్లోబ్ ట్రాట‌ర్ మూవీని అద్బుతంగా తెర‌కెక్కించే ప్ర‌యత్నం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దీనిని పూర్తిగా అడ్వెంచ‌ర్ నేప‌థ్యంతో తీస్తున్నాడు. ఇప్ప‌టికే సినిమాకు సంబంధించి పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌కు రాక పోయిన‌ప్ప‌టికీ కొన్ని ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి పూర్తిగా పిచ్చెక్కించేలా ఉన్నాయి. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెంచేలా చేశాయి. ఈ త‌రుణంలో ఎస్ఎస్ రాజ‌మౌళి నుంచి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ఈ మేర‌కు మూవీ మేక‌ర్స్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

Rajamouli Movie Updates

ఈనెల 15వ తేదీన భారీ ఎత్తున రాజ‌మౌళి తీసిన గ్లోబ్ ట్రాట‌ర్ ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ ను లాంచ్ చేయ‌బోతున్నారు. ఇందుకు సంబంధించిన ప్ర‌చారం జోరందుకుంది. ఇందుకు సంబంధించిన మెగా ఈవెంట్ హైద‌రాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ వేదిక కానుంది. 50 వేల మందికి పైగా హాజ‌ర‌వుతున్న‌ట్లు భావిస్తున్నారు. ఈ టీజ‌ర్, ఫ‌స్ట్ లుక్ తెలుగు, ఇంగ్లీష్ రెండింటి లోనూ అందుబాటులోకి తీసుకు వ‌స్తున్నార‌ని నిర్వాహ‌కులు వెల్ల‌డించారు. ఇది భారతదేశం అంతటా , వెలుపల విస్తృత ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఇదిలా ఉండ‌గా శనివారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం అవుతుంది. ఈ గ్రాండ్ ప్రీమియ‌ర్ ఈవెంట్ ను జియో హాట్ స్టార్ ప్ర‌త్యేకంగా ప్రసారం చేయ‌నుంది. ఈ విష‌యాన్ని జియో ప్ర‌క‌టించింది.

Also Read : K Kavitha Strong Demand : కిష్ట‌రాయినిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ నిర్వాసితుల‌ను ఆదుకోవాలి

Exit mobile version