‘డ్రాగ‌న్ ‘తో ఆలియా, షాహిద్ ల‌కు సంబంధం లేదు

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మూవీ

hellotelugu-Dragon

బెంగ‌ళూరు : ఉత్కంఠ‌ను రేపుతోంది డ్రాగ‌న్ చిత్రం. ఇందులో కీ రోల్ పోషిస్తున్నారు స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. దీనికి కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ‘డ్రాగన్’ చిత్రంతో ఆలియా భట్, షాహిద్ కపూర్‌లు కూడా ఇందులో న‌టిస్తున్న‌ట్లు పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. దీనిపై కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది మూవీ బృందం. వారికి ఎలాంటి సంబంధం లేద‌ని పేర్కొంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో ‘డ్రాగన్’ చిత్రం ఘ‌నంగా రూపొందుతోంది. ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కలయికలో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘డ్రాగన్’ చిత్రంలో బాలీవుడ్ నటులు ఆలియా భట్ మరియు షాహిద్ కపూర్ భాగం కానున్నారనే వార్తలను చిత్ర నిర్మాణ సంస్థ సన్నిహిత వర్గాలు ఖండించాయి. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదు. తాము వారిలో ఎవరినీ ఒప్పందం చేసుకోలేదని అని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థ తెలిపింది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కన్నడ నటి రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది, కానీ ఇంకా తేదీ ఖరారు కాలేదు అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కాగా ఎన్టీఆర్‌కు ఇటీవల జరిగిన భుజం శస్త్రచికిత్స కారణంగా సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచే సుకున్నాయి. ఆయన సాధారణ స్థితికి రావడానికి సుమారు రెండు మూడు నెలల సమయం పట్టవచ్చని అంచనా, అయితే ఎన్టీఆర్ కోలుకునే సమయంలో సినిమా నిర్మాణం పూర్తిగా ఆగిపోదు. ఎన్టీఆర్ తాత్కాలికంగా షూటింగ్‌కు దూరంగా ఉన్నందున, ఆ సమయాన్ని ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రం ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ (ప్రభాస్‌తో)కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ , ఇతర ప్రాథమిక పనులపై దృష్టి సారించడానికి వినియోగించుకునే అవకాశం ఉంది.

Exit mobile version