Rashmika : చెన్నై : దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ నటి, నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మిక మందన్నా (Rashmika) గురించి ప్రశంసలు కురిపించారు. తనలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నాడు. తాజాగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు నటి రష్మిక . తను డియర్ కామ్రేడ్, గీత గోవిందంలో కలిసి నటించిన ప్రముఖ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కొంత కాలం పాటు ప్రేమాయణం నడిపారు. ఈ ఇద్దరూ కలిసి కొన్నేళ్ల పాటు ఎంజాయ్ చేశారు. డేటింగ్ లో కలిసి మెలిసి ఉన్నారు. చివరకు ఎట్టకేలకు ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థం (ఎంగేజ్మెంట్) చేసుకున్నారు. దీనిపై శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్.
Rahul Ravindran – Rashmika Mandanna
తను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ది గర్ల్ ఫ్రెండ్ . ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తోంది నటి రష్మిక మందన్నా. తన మనసులోని భావాలను పంచుకున్నారు డైరెక్టర్. పురుష లేదా స్త్రీ-కేంద్రీకృత చిత్రాలు వంటి క్లిషేడ్ లేబుల్‌లను దాటి మనం ముందుకు వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైందన్నారు రాహుల్ రవీంద్రన్ అన్నారు. రష్మిక మందన్న తన రాబోయే చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ తో కొత్త మార్గాన్ని అనుసరిస్తోందని చెప్పారు. ఈ సినిమాను వచ్చే నెల నవంబర్ 8న విడుదల చేస్తామని ప్రకటించారు డైరెక్టర్. తొలి మహిళా-కేంద్రీకృత చిత్రంగా గుర్తించడం తమ సినిమా పై మరింత నమ్మకాన్ని కలిగించేలా చేసిందన్నారు రాహుల్ రవీంద్రన్.
నేను రష్మికకు కథ చెప్పినప్పుడు వాస్తవిక పాత్రలు, నిజాయితీ భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యిందన్నారు. సూపర్ స్టార్లతో స్క్రీన్‌లను పంచుకున్న తర్వాత కూడా యువ నటుడు ధీక్షిత్ శెట్టితో కలిసి పని చేయడం
తనను విస్తు పోయేలా చేసిందన్నారు.
Also Read : Sasivadane Movie Sensational : అన్ని వర్గాలను ఆకట్టుకునేలా శశివదనే
