Sasivadane Movie Sensational : అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా శ‌శివ‌ద‌నే

ఎలాంటి అస‌భ్య‌త లేకుండా సినిమా నిర్మాణం

Hello Telugu - Sasivadane Movie Sensational

Hello Telugu - Sasivadane Movie Sensational

Sasivadane : హైద‌రాబాద్ : అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకునేలా శశివ‌ద‌నే (Sasivadane) మూవీ తీయ‌డం జ‌రిగింద‌న్నారు మూవీ మేక‌ర్స్. ఎలాంటి అసభ్యత లేకుండా ఉండేలా జాగ్ర‌త్త ప‌డేలా చూశామ‌న్నారు. శశివదనే థియేటర్లలో అందరినీ ఆశ్చర్య పర్చ‌డం ఖాయ‌మ‌న్నారు న‌టి కోమ‌లీ ప్ర‌సాద్. ఈ మూవీలో త‌న‌తో పాటు ర‌క్షిత్ అట్లూరి కీల‌క పాత్ర‌లు పోషించారు. దీనిని పూర్తిగా రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఏజీ ఫిల్మ్ కంపెనీ, ఎస్వీఎస్ స్టూడియ‌స్ బ్యాన‌ర్ల‌పై అహితేజ బెల్లంకొండ‌, అభిలాష్ రెడ్డి గొడాల దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. శ‌శివ‌ద‌న చిత్రాన్ని సాయి మోహ‌న్ ఉబ్బ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీని గోదావ‌రి అందాల‌ను తెర‌పై అద్బుతంగా ఆవిష్క‌రించారు. ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 10న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.

Sasivadane Movie Updates

విడుదలకు ముందు నిర్మాతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. మూడు సంవత్సరాల క్రితం తేజ ఈ కథను చెప్పారు. తొలుత కొంత అర్థం కాలేదు. వ్య‌క్తిగ‌త స‌న్నివేశాలు చాలా న‌చ్చాయి. ఇదే స‌మ‌యంలో త‌ను గ‌తంలో తీసిన ల‌ఘు చిత్రాల‌ను చూశాన‌ని, ఆ త‌ర్వాత తాను న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్లు చెప్పారు న‌టుడు ర‌క్షిత్ అట్లూరి. ఈ మూవీలో ప్ర‌ధానంగా తండ్రీ కొడుకుల మ‌ధ్య భావోద్వేగ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారంటూ ద‌ర్శ‌కుడిని ప్ర‌శంసించారు. గోదావ‌రి మ‌రింత అందంగా క‌నిపించేలా చేయ‌డం ఆనందం క‌లిగించింద‌న్నారు. ఇక కోమ‌లీ ప్ర‌సాద్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు న‌టుడు.

 

Also Read : Israel PM Warning : గాజా నుంచి బ‌ల‌గాల నిష్క్ర‌మ‌ణ ఒప్పుకోం

Exit mobile version