‘నా వైఫ్ మిస్సింగ్’ నుండి ‘అరెరే వినవా’ పాటను ఆవిష్కరించారు ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. వరుణ్ సందేశ్ , శ్వేతా బసు ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆహా’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘నా వైఫ్ మిస్సింగ్’లోని ‘అరెరే వినవా’ అనే రొమాంటిక్ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అక్టోబర్ 22న ప్రసారం కానున్న ఈ సిరీస్‌పై ఆసక్తిని పెంచుతున్న ఈ పాటను ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు. లైట్‌హౌస్ సినీ మ్యాజిక్ బ్యానర్‌పై శివ కాంతమనేని నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. ఇది ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో తెలుగు , తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా కె. రాఘవేంద్ర రావు ‘అరెరే వినవా’ పాటను , సంగీత దర్శకుడు సాయి కార్తీక్‌ను ప్రశంసించారు.
పాట శీర్షికే ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ వెబ్ సిరీస్ దర్శకుడు, నిర్మాత , మొత్తం బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కంటెంట్-ఆధారిత ప్రాజెక్ట్‌లకు ‘ఆహా’ తన మద్దతును కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాయి కార్తీక్ స్వరపరిచిన ఈ మధురమైన ‘అరెరే వినవా’ పాటకు శ్రీ సాయి కిరణ్ హృదయానికి హత్తుకునే సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి తన ఉత్సాహ భరితమైన గొంతుతో ఆలపించారు. ప్రేమ, విరహం , తమ భావాలను ప్రియమైన వారికి తెలియ జేయాలనే తపన చుట్టూ ఈ పాట సాగుతుంది. దీనిలోని భావోద్వేగభరితమైన సాహిత్యం, ఆహ్లాదకరమైన సంగీతం, రాబోయే వెబ్ సిరీస్ మూడ్‌ను ప్రతిబింబిస్తాయి. వరుణ్ సందేశ్ , శ్వేతా బసు ప్రసాద్ నటించిన ‘నా వైఫ్ మిస్సింగ్’ త్వరలో డిజిటల్ వేదికపై విడుదల కానుంది. అక్టోబర్ 22న విడుదల కానున్న ఈ సిరీస్ ప్రచారంలో భాగంగా వచ్చిన ‘అరెరే వినవా’ అనే రొమాంటిక్ పాట మరో ఆకర్షణగా నిలిచింది.
