Rahul Gandhi Fired on EC : ఈసీపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్

త‌ప్పులు ఎత్తి చూపితే నోటీసులు పంపుతారా

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Hello Telugu - Rahul Gandhi Fired on EC

Rahul Gandhi : న్యూఢిల్లీ – కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్వ‌హ‌ణ‌పై. పూర్తిగా విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు. తాను చేసిన త‌ప్పుల‌ను ఎత్తి చూపితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంఘం నోటీసులు పంపించింద‌ని, ఇదెక్కడైనా ఉందా అని ప్ర‌శ్నించారు. బీహార్ లో ల‌క్ష ఓట‌ర్లు కొత్త‌గా న‌మోదయ్యార‌ని, అదే స‌మ‌యంలో ఒక‌రికి రెండు మూడు చోట్ల ఓట‌ర్ కార్డులు ఉన్నాయ‌ని ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ. ఈ దేశానికి గుండె కాయ లాంటిది కేంద్ర ఎన్నిక‌ల సంఘం అని. కానీ అది 2014 నుంచి త‌న స్థానాన్ని కోల్పోయింద‌న్నారు. కేవ‌లం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ చెప్పిన‌ట్లు న‌డుస్తోందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాహుల్ గాంధీ.

Rahul Gandhi Slams EC

అంతే కాదు ఒక మనిషి, ఒక ఓటును సమర్థించడంలో ఈసీ విఫలమైందని మండిప‌డ్డారు ఎంపీ. ఎన్నికల కమిషన్ తన విధిని విస్మరించిందని ఆరోపించారు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షించడానికి కట్టుబడి ఉందని, దానిని కొనసాగిస్తుందని స్ప‌ష్టం చేశారు.మేము రాజ్యాంగాన్ని రక్షిస్తున్నాము. ఒక వ్యక్తి ఒక ఓటు రాజ్యాంగానికి పునాది. ఒక వ్యక్తి, ఒక ఓటును అమలు చేయడం ఎన్నికల సంఘం విధి, కానీ వారు తమ విధిని నిర్వర్తించలేదు. ఈరోజు తెల్లటి టీ-షర్టులతో కలిసి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అంశంపై పార్లమెంటులో నిరసన తెలిపారు రాహుల్ గాంధీ. అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు ‘124 నాటౌట్’ అనే నినాదంతో టీ-షర్టులను ధరించి వచ్చారు. ప్రతిపక్షం తన ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు సీపీఐ(ఎం) ఎంపీ పి. సందోష్ కుమార్ తెలిపారు. ఇది అఖిల భారత ప్రచారంగా మారిందన్నారు. సంకీర్ణ భాగస్వాముల మధ్య ఇప్పుడు మరింత ఐక్యత ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇది ఒక భారీ పోరాటం అవుతుంద‌ని చెప్పారు.

Also Read : Minister Ramanaidu Alarming : వేగంగా పోల‌వ‌రం డ‌యాఫ్రం వాల్ ప‌నులు

Exit mobile version