Rahul Gandhi- Kharge Avoid : ఇండిపెండెన్స్ డేకు రాహుల్, ఖ‌ర్గే దూరం

సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు

Hello Telugu - Rahul Gandhi- Kharge Avoid

Hello Telugu - Rahul Gandhi- Kharge Avoid

Rahul Gandhi : న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రిగాయి. దేశ ప్ర‌ధాన‌మంత్రి ఎర్ర‌కోట‌పై జాతీయ జెండాను ఎగుర వేశారు. జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథులుగా రావాల్సిన ప్ర‌తిప‌క్ష నేత‌లు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ఎంపీ రాహుల్ గాంధీలు (Rahul Gandhi) హాజ‌రు కాక పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్బంగా జాతిని ఉద్దేశించి 143 కోట్ల ప్ర‌జానీకానికి సోష‌ల్ మీడియా వేదిక‌గా ఖ‌ర్గే, రాహుల్ శుభాకాంక్ష‌లు తెలిపారు. గ‌త ఏడాది ఈ ఇద్ద‌రి నేత‌ల‌కు ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింది. ఇది దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. కావాల‌ని మోదీ స‌ర్కార్ అగ్ర నేత‌ల‌ను ప‌క్క‌న పెట్టార‌ని అందుకే ఈసారి జ‌రిగిన స్వేచ్ఛా వేడుక‌ల‌కు వెళ్ల కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

Rahul Gandhi and Mallikarjun Kharge Escaped

విపక్ష పార్టీ నుండి లేదా ఇద్దరు నాయకుల నుండి అధికారిక ప్రకటన రాలేదు కానీ గత సంవత్సరం సీట్ల అమరికతో అసంతృప్తి చెందినందు వ‌ల్ల‌నే వీరు దూరంగా ఉన్న‌ట్లు బ‌య‌ట విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు నేత‌లు స్వాతంత్ర స‌మ‌ర యోధుల త్యాగాల ద్వారా సాధించిన ఈ స్వేచ్ఛ, సత్యం, సమానత్వం పునాదిపై న్యాయం ఆధారపడిన, ప్రతి హృదయం గౌరవం , సోదరభావంతో నిండిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పం కొన‌సాగుతుంద‌న్నారు రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. ఈ విలువైన వారసత్వం గర్వం, గౌరవాన్ని కాపాడు కోవడం మనందరి కర్తవ్యం. జై హింద్, జై భారత్ అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొన్నారు.

Also Read : PM Modi – GST Interesting Update : దీపావ‌ళి నాటికి జీఎస్టీ రేట్లు త‌గ్గిస్తాం – పీఎం

Exit mobile version