PM Modi – GST Interesting Update : దీపావ‌ళి నాటికి జీఎస్టీ రేట్లు త‌గ్గిస్తాం – పీఎం

ఎర్ర‌కోట సాక్షిగా ప్ర‌క‌టించిన న‌రేంద్ర మోదీ

Hello Telugu - PM Modi - GST Interesting Update

Hello Telugu - PM Modi - GST Interesting Update

PM Modi : న్యూఢిల్లీ – దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 79వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎర్ర‌కోట‌పై జాతీయ ప‌తాకాన్ని ఎగుర వేశారు. ఈ సంద‌ర్బంగా 143 కోట్ల ప్ర‌జానీకానికి తీపి క‌బురు చెప్పారు. వ‌చ్చే దీపావ‌ళి పండుగ రోజు మీకంద‌రికి ఓ శుభ‌వార్త చెబుతాన‌ని అన్నారు. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం విధించిన జీఎస్టీ రేట్లు గణనీయంగా తగ్గుతాయని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. పరోక్ష పన్ను విధానం 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున జీఎస్టీలో సంస్కరణలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ (PM Modi) అన్నారు . వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ)లో తదుపరి తరం సంస్కరణలు ఆవిష్కృతమవుతాయని, ఇది సామాన్యులకు ‘గణనీయమైన’ పన్ను ఉపశమనం కల్పిస్తుందని చెప్పారు పీఎం.

PM Modi Key Comments on GST

ఈ నిర్ణ‌యం వ‌ల్ల దేశంలోని చిన్న, మధ్య తరహా సంస్థలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ప‌ష్టం చేశారు. అనేక పన్నులు, స్థానిక సుంకాలను కలిపిన GST జూలై 1, 2017న అమల్లోకి వచ్చింది. తాము రాష్ట్రాల‌తో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు న‌రేంద్ర మోదీ. దీపావళి నాటికి తదుపరి తరం GST సంస్కరణలను ప్రారంభిస్తామ‌న్నారు, ఇది పౌరులకు దీపావళి బహుమతి అవుతుందన్నారు. సామాన్యుల వస్తువులపై పన్ను గణనీయంగా తగ్గుతుందని స్ప‌ష్టం చేశారు. మన ఎంఎస్ఎంఈలు కూడా భారీగా ప్రయోజనం పొందుతాయని అన్నారు. రోజువారీ వినియోగ వస్తువులు చౌకగా మారతాయని ఇది పేద‌ల‌కు మ‌రింత మేలు క‌లిగిస్తుంద‌న్నారు. ఈ త‌గ్గింపు కార‌ణంగా భార‌త దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని చెప్పారు.

Also Read : AP-Telangana Heavy Rains Warning : తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌కు హై అల‌ర్ట్

Exit mobile version