Rahul Gandhi Shocking Comments : బీహార్ ఎన్నిక‌ల‌పై రాహుల్ గాంధీ ఫోక‌స్

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ కీల‌క స‌మావేశం

Hello Telugu - Rahul Gandhi Shocking Comments

Hello Telugu - Rahul Gandhi Shocking Comments

Rahul Gandhi : బీహార్ : బీహార్ లో ఎన్నిక‌ల వేడి రాజుకుంది. వ‌చ్చే ఏడాది 2026లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న నితీశ్ కుమార్, భార‌తీయ జ‌న‌తా పార్టీలు కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈసారి కూడా ఎలాగైనా స‌రే ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మ‌రో వైపు ఎంఐఎం పార్టీ చీఫ్‌, హ‌ద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ బీహార్ లో పాగా వేశారు. ఆయ‌న నిన్న సీమాంచ‌ల్ నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ఇండియా కూట‌మి త‌మ‌తో క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చింది. ఈ మేర‌కు బీహార్ రాష్ట్ర పార్టీ చీఫ్ లేఖ కూడా రాశారు. దీనికి ఆర్జేడీ చీఫ్ , మాజీ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ నుంచి ఎలాంటి స్పంద‌న లేక పోవడంతో ఒంట‌రిగానే తాము పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈమేర‌కు ప్ర‌చారానికి శ్రీకారం చుట్టారు.

Rahul Gandhi Shocking Comments on Bihar Assembly Elections

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే రాహుల్ గాంధీ (Rahul Gandhi), తేజ‌స్వి యాద‌వ్ క‌లిసి బీహార్ లో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ర్యాలీలు నిర్వ‌హించారు. జ‌నం పెద్ద ఎత్తున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు. ఈ స‌మ‌యంలో ఇవాళ ఏఐసీసీ మాజీ చీఫ్‌, ఎంపీ , లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు రాహుల్ గాంధీ బీహార్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా కీల‌క‌మైన కాంగ్రెస్ వ‌ర్కింగ్ కమిటీ కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన అనేక మంది అగ్ర నాయకులు కూడా హాజ‌ర‌య్యారు. కీల‌క‌మైన ప‌ద‌వుల‌లో ఉన్న వారంతా క్యూ క‌ట్టారు బీహార్ కు. అయితే పార్టీ అగ్ర నేత‌లు ఈ మీటింగ్ అత్యంత కీల‌కం కాబోతోంద‌ని భావిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాలా కూడా పాట్నాకు చేరుకున్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దేశ రాజ‌కీయాలలో బీహార్ ఎన్నిక‌లు దిశా నిర్దేశం చేయ‌నున్నాయ‌ని పేర్కొన్నారు.

Also Read : Asia Cup 2025 PAK vs SL Sensational : ఎట్ట‌కేల‌కు స‌త్తా చాటిన పాకిస్తాన్

Exit mobile version