నా స్వంత ఊరు తిరువ‌నంత‌పురం : కీర్తి సురేష్

ఇక్క‌డికి రావ‌డం ఆనందంగా ఉంద‌న్న మ‌హాన‌టి

hellotelugu-KeerthySuresh

తిరువ‌నంత‌పురం : ప్ర‌ముఖ న‌టి కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నా స్వ‌స్థ‌లం తిరువ‌నంత‌పురం. కానీ వృత్తి రీత్యా తమిళ‌నాడుకు వెళ్లాల్సి వ‌చ్చింది. ఆ దేవుడి దయ వ‌ల్ల ఇప్పుడు ద‌క్షిణాది రాష్ట్రాల‌లో మ‌హాన‌టి సినిమా ద్వారా నాకు మంచి పేరు వ‌చ్చింది. అదంతా మీ అంద‌రి మ‌ద్ద‌తు , ప్రేమ , అనురాగం వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌ని అన్నారు. ఇదిలా ఉండ‌గా కేర‌ళ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన ప్ర‌తిష్ట‌త్మాకమైన హ‌డిల్ గ్లోబల్ 2026లో భాగం కావడం చెప్ప‌లేనంత ఆనందంగా ఉంద‌న్నారు కీర్తి సురేష్. ఒక ర‌కంగా చెప్పాలంటే త‌న జీవితంలో ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా మిగిలి పోతుంద‌న్నారు. అద్భుత ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడానికి, వారికి సాధికారత కల్పించడానికి ,అవకాశాలను కల్పించడానికి కేరళ ప్రభుత్వం చేపట్టిన ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది అని ప్ర‌శంస‌లు కురిపించారు.

స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో ఒక పెట్టుబడిదారుడిగా భాగం కావాలనే ఆసక్తి ఉన్న వ్యక్తిగా, ఆవిష్కరణలను పెంపొందించే, యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇచ్చే, ఆశాజనకమైన ఆలోచనలను వాస్తవ రూపంలోకి తీసుకు రావడానికి సహాయపడే ఇలాంటి కార్యక్రమాలతో అనుబంధం కలిగి ఉండటం నాకు మ‌రింత గ‌ర్వంగా ఉంద‌న్నారు కీర్తి సురేష్‌. ముఖ్యమంత్రి వి. డి. సతీసన్, మంత్రి పి. కె. కున్హాలికుట్టి, బెల్జియం రాయబార కార్యాలయంలోని రాయబారి సోఫీ కార్ల్‌షౌసెన్, ఎమ్మెల్యే ఎం. విన్సెంట్, కేరళ స్టార్టప్ మిషన్ సీఈఓ అనూప్ అంబిక ఎలక్ట్రానిక్స్ , ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్. సుహాస్ ఐఏఎస్ గారి పాటు ఈ కార్యక్రమంలో భాగం కావడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు కీర్తి సురేష్‌.

Exit mobile version