Rahul Gandhi : ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బాంబు పేల్చారు. దేశం సాక్షిగా ఆయన సంచలన ఆధారాలను బయట పెట్టారు. సెంట్రల్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఓటర్లను తొలగించారని ప్రకటించారు. గురువారం ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సత్య దూరమని, అవాస్తవమని కేంద్ర ఎన్నికల సంఘం ఆరోపించింది. ఎఫ్ఐఆర్ ను స్వయంగా దాఖలు చేసింది. ఈ సందర్బంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కాంగ్రెస్ బలమైన ప్రాంతాల నుండి ఓటర్లను సామూహికంగా తొలగించారని ఆరోపించారు. ఈ ఓటరు ఐడీలను రాష్ట్రం వెలుపల నుండి నకిలీ లాగిన్‌లు, ఫోన్ నంబర్‌లను ఉపయోగించి తొలగించారని పేర్కొన్నారు. అయితే ఓటర తొలగించింది వ్యక్తులు కాదని ఓ సాఫ్ట్ వేర్ సాయంతో, కేంద్రీకృత పద్ధతిలో అమలు చేస్తున్నారని సంచలన కామెంట్స్ చేశారు .
Rahul Gandhi Comments
ఈసీ ఆయన చేసిన విమర్శలను కొట్టి పారేసింది. ఓటరుకు లేదా తమ కుటుంబానికి తెలియ చేయకుండా ఎలాంటి తొలగింపు ప్రక్రియ చేపట్టదని స్పష్టం చేసింది. దీనిపై మండిపడ్డారు రాహముల్ గాంధీ. భారతదేశం అంతటా లక్షలాది మంది ఓటర్లను, వివిధ వర్గాలను, ప్రధానంగా ప్రతిపక్షానికి ఓటు వేస్తున్న వారిని ఒక సమూహం క్రమపద్ధతిలో తొలగించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఎందుకలా జరుగుతోందని మేం చాలా సార్లు సమావేశం కావడం జరిగింది. ఇందుకు సంబంధించి పరిశోధనలు కూడా చేశామన్నారు. విస్తృతంగా జరిపిన సర్వేలో విభ్రాంతికరమైన వాస్తవాలు వెలుగు చూశాయని చెప్పారు ఎంపీ. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నాను, ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రేమిస్తున్నాను. 100 శాతం రుజువు ఆధారంగా కాకుండా నేను ఇక్కడ ఏమీ చెప్పబోవడం లేదు. తీర్పు మీదేనని ప్రకటించారు రాహుల్ గాంధీ.
Also Read : Minister Nara Lokesh – AP Growth : ఏపీ పెట్టుబడిదారులకు స్వర్గధామం
