Manda Krishna Madiga Shocking Comments : ఆత్మ గౌర‌వానికి ఆటంకం క‌లిగితే ఊరుకోం

హెచ్చ‌రించిన ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ

Hello Telugu - Manda Krishna Madiga Shocking Comments

Hello Telugu - Manda Krishna Madiga Shocking Comments

Manda Krishna Madiga : హైద‌రాబాద్ : ఆత్మ గౌరవం కంటే త‌మ‌కు ఏది ముఖ్యం కాద‌ని అన్నారు మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి అధ్య‌క్షుడు మంద‌కృష్ణ మాదిగ‌. దళిత జాతి ఆత్మ గౌరవానికి ఆటంకం కలిగితే ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని ప్ర‌క‌టించారు. ఆత్మగౌరవ విషయంలో రాజీ పడటం అంటే ప్రాణం లేని నిర్జీవంతో స‌మాన‌మ‌ని అన్నారు. భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ బీఆర్ గ‌వాయ్ పై జ‌రిగిన షూ దాడి దారుణ‌మ‌న్నారు. ఇది దేశంలోని కోట్లాది మంది ద‌ళిత‌, బ‌హుజ‌నుల మీద జ‌రిగిన దాడిగా ఆయ‌న పేర్కొన్నారు. దీనిని తాము క్ష‌మించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు మంద‌కృష్ణ మాదిగ‌ (Manda Krishna Madiga). ఈ దాడి ముమ్మాటికి కుల అహంకారంతో చేసిన దాడి అని మండిప‌డ్డారు.

Manda Krishna Madiga Key Comments

దాడి జ‌రిగిన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఆవేదన చెందారని వాపోయారు. ఈనెల 27న హైదరాబాదులో ద‌ళితుల ఆత్మ గౌర‌వ మ‌హా ర్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు మంద‌కృష్ణ మాదిగ‌. దీనిని విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి రామ్ రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెమినార్ హాల్లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) రాష్ట్ర స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని MSF తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సందే కార్తీక్ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మందకృష్ణ మాదిగ హాజరరై ప్ర‌సంగించారు. గ‌వాయ్ పై జ‌రిగిన దాడిని ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని అన్నారు.

Also Read : Minister Kandula Durgesh Interesting Update : సాంస్కృతిక రంగానికి ఏపీ స‌ర్కార్ పెద్ద‌పీట

Exit mobile version