న్యూఢిల్లీ : వివాదాస్పద నటి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ , శృతి హాసన్, జాహ్నవి కపూర్ , జగపతి బాబు, శివ రాజ్ కుమార్ కీలక పాత్రలలో నటించిన పెద్ది విడుదలైంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన మేర వర్కవుట్ కాలేదు. ఇదే సమయంలో ఈ సినిమాలో కేవలం జాహ్నవి కపూర్ ను అందాలు ఒలికించేందుకు, చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడని ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున ట్రోలింగ్ కు గురయ్యాడు. దీనిపై కూడా డైరెక్టర్ తనను మన్నించాలని కోరాడు. ఆపై తిరుమలను దర్శించుకున్నాడు. ఇంకా పెద్ది బ్రేక్ ఈవెన్ రావడానికి నానా తంటాలు పడుతోంది పెద్ది చిత్రం. ఇప్పటికే రామ్ చరణ్ గతంలో నటించిన శంకర్ తీసిన గేమ్ ఛేంజర్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. తీరా పెద్ది సైతం ఆశించిన మేర ఆడడంలేదు.
మరో వైపు అన్ని వైపుల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా జాహ్నవి కపూర్ పాత్రపై , తనను మరింత అసభ్యకరంగా చూపించడం పట్ల తీవ్రంగా స్పందించారు నటి, ఎంపీ కంగనా రనౌత్. ఏదైనా సన్నివేశం సరిగా లేదనిపిస్తే మహిళా నటీమణులు తమ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు అని అన్నారు. తన కొత్త చిత్రం భారత్ భాగ్య విధాత ప్రచారంలో ఉన్నారు. ఒక మూసి ఉన్న గదిలో కూర్చుని స్క్రిప్ట్ రాసే పురుషుల బృందానికి అది అంత అభ్యంతరకరంగా అనిపించి ఉండక పోవచ్చని దర్శకులు అంగీకరించే అవకాశం ఉందని కంగనా రనౌత్ అన్నారు. తను చసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఎవరూ ‘మహిళలను వస్తువుగా చూపిద్దాం’ అనే ఉద్దేశంతో సినిమా తీయరు అని అన్నారు.



















