విజయవాడ : ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలోని తిరువనంతపురం కార్పొరేషన్ ను తాము కైవసం చేసుకున్నామని, ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కమలం వికసించడం ఖాయమని జోష్యం చెప్పారు. ప్రధాని మోడీని కలిసేందుకు డిల్లీ బయలు దేరారు కేరళ తిరువనంతపురం కార్పిరేటర్లు. ఈసందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద వారిని కలిశారు బిజెపి ఎపి అధ్యక్షులు పివియన్ మాధవ్, ఇతర నేతలు. ఇదిలా ఉండగా కేరళ రాజధాని తిరువనంతపురంలో బిజెపి మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్‌ను దక్కించు కోవడం ఒక అద్భుతమైన ఘట్టం అని పేర్కొన్నారు. గత 70 ఏళ్లుగా కేరళలో జాతీయవాద శక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్.
మార్క్సిస్టుల హింసాకాండలో సుమారు 76 మంది బిజెపి కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని, వందల మంది జైలు పాలయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమ పార్టీ తరపున తిరువనంతపురం మేయర్ గా వీవీ రాజేష్ మేయర్ గా ఎన్నికయ్యారని, తనపై గతంలో రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని చెప్పారు పీవీఎన్ మాధవ్. ఇక డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన ఆశ మూడుసార్లు కార్పొరేటర్‌గా పని చేశారన్నారు. కానీ తనను మహిళ అని చూడకుండా దాడులకు పాల్పడ్డారని వాపోయారు. విజయం సాధించిన 56 మంది కార్పొరేటర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానించారని తెలిపారు. కేరళ ఎక్స్ ప్రెస్ లో ఢిల్లీకి వెళుతున్నారని, మధ్యలో ఆగిన వీరికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు మాధవ్.


















