PVN Madhav : విజయవాడ – భారతీయ జనతా పార్టీ సంచార జాతుల్లో స్పూర్తి నింపిందన్నారు రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ (PVN Madhav). విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో స్పూర్తి పేరుతో కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల నుంచి 34 సంచార జాతులు ,తెగలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తమ కళలలను ప్రదర్శించడం తో ఒక సమ్మేళనం లా సాగింది. రెండు గంటల పాటు ప్రదర్శనలు ఇచ్చారు. జాతీయ సహా సంఘటనా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ తో సహా బిజెపి ఎమ్మెల్యే లు, నేతలు కూడా వారి తో మమేకమయ్యారు. మన ధర్మం ఇంకా ఉందంటే అందుకు సంచార జాతులేనని అన్నారు. వీరంతా సంస్కృతికి వారధులని అన్నారు మాధవ్. శతాబ్దాల తరబడి మన సాంప్రదాయాలను పరిరక్షిస్తూ వస్తున్నారని కొనియాడారు.
PVN Madhav Key Comments
నేటికి సంస్కృతిని విడనాడకుండా, వివక్షతను పట్టించు కోకుండా సంచార జాతుల వారు చేస్తున్న సేవలు చాలా గొప్పవన్నారు మాధవ్. మీ సంప్రదాయాలు, కట్టుబాట్లు గురించి అందరూ తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలకు నేడు చాలా మంది దూరంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ చీఫ్. సంచార జాతుల వారు ప్రకృతితో మమేకమై, ఆరాధిస్తున్న గొప్ప వారంటూ పేర్కొన్నారు. వారికి చెట్టు దేవత.. ఆ చెట్టునే ఆరాధన చేస్తూ.. మన పండుగల గొప్పతనం గురించి చాటి చబుతుండడం అభినందనీయమన్నారు. తప్పకుండా మీ సేవలను గుర్తించి,, మీకంటూ ఒక గుర్తింపు ఇఛ్చేలా స్పూర్తి అనే కార్యక్రమం చేపట్టామన్నారు.
ఎంపీ లక్ష్మణ్ పార్లమెంట్ లో మాట్లాడినందుకే.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు ఆలోచన చేస్తున్నాయన్నారు. ఓబీసీల కోసం చేస్తున్న లక్ష్మణ్ , ఆర్. కృష్ణయ్య, వెంకట సత్యనారాయణ వంటి వారు మన సభకు రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీ అందరికీ అండగా ఉన్నారని ప్రకటించారు.
Also Read : Hero Pawan Kalyan OG : సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్
