పూరీ జ‌గ‌న్నాథ్ ప్ర‌యాణం అద్భుతం

ప్ర‌శంస‌లు కురిపించిన విజ‌య్ సేతుప‌తి

hellotelugu-VijaySethupathi

చెన్నై : త‌మిళ సినీ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ గురించి ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న‌తో క‌లిసి చేసిన జ‌ర్నీ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నాడు. త‌న‌తో క‌లిసిన క్ష‌ణాల‌ను ఎల్ల‌ప్ప‌టికీ మ‌రిచి పోలేన‌ని తెలిపాడు. సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా అరుదైన ఫోటోల‌ను పంచుకున్నారు. సినిమా రంగంలో 26 ఏళ్లు పూర్తి చేసుకోవడం అనేది కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు. అది ధైర్యం, దృఢ సంకల్పం , నిర్భయమైన గళంతో నిర్మించుకున్న ఒక గొప్ప వారసత్వం అని పేర్కొన్నారు.

తాజాగా ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ సేతుప‌తి కీల‌క రోల్ పోషిస్తున్నాడు స్ల‌మ్ డాగ్ మూవీలో. మీతో క‌లిసి ప‌ని చేయ‌డం తాను ఎల్ల‌ప్ప‌టికీ మ‌రిచి పోలేన‌ని తెలిపాడు. నటీనటులుగా మమ్మల్ని నమ్మే, మా పరిమితులను దాటి మాలోని అత్యుత్తమ నటనను వెలికి తీసే దర్శకుల కోసం మేము ఎప్పుడూ ఎదురు చూస్తుంటామ‌న్నాడు. మీరు ఆ పనిని ఎంతో సహజంగా, అప్రయత్నంగా చేస్తారన్నాడు. ఈ చిత్రంలో భాగమైన మా అందరికీ, ఇది ఒక అత్యంత ప్రత్యేకమైన సినిమాగా ఎప్పటికీ గుర్తుండి పోతుందని నేను నమ్ముతున్నానని అన్నాడు.

మీరు ఇలాగే విజయాలను అందుకోవాలని, రాబోయే మరెన్నో ఏళ్లపాటు మీ ప్రభావ వంతమైన కథా కథనాలతో ప్రేక్షకులను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎప్పటికీ మా గౌరవం ఉంటుందన్నారు.

Exit mobile version