కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ స‌ర్కార్ బాధ్య‌త

స్ప‌ష్టం చేసిన మంత్రి వాసంశెట్టి సుభాష్

hellottelugu-VasamSettiSubhash

విజయవాడ : కార్మికుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ఏపీ కూట‌మి స‌ర్కార్ బాధ్య‌త అని స్ప‌స్టం చేశారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. విజయవాడలోని స్థానిక స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో కార్మిక శాఖకు సంబంధించిన కనీస వేతనలా సలహా మండలి చైర్మన్, సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని ప్ర‌సంగించారు. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు, సంక్షేమం, కనీస వేతనాల అమలు, కార్మికులకు అందుతున్న ప్రభుత్వ పథకాలు తదితర అంశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు.

కార్మికులకు న్యాయమైన కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరంపై మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచనలు చేశారు. కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కార్మికులకు మెరుగైన వేతనాలు, సామాజిక భద్రత, గౌరవ ప్రదమైన జీవన పరిస్థితులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంద‌న్నారు వాసం శెట్టి సుభాష్. కనీస వేతన సలహా మండలి చైర్మన్, సభ్యులు క్షేత్రస్థాయిలో కార్మికుల సమస్యలను అధ్యయనం చేసి, సంబంధిత రంగాల వారీగా వేతనాల పరిస్థితిపై సమగ్ర నివేదికలు రూపొందించాలని మంత్రి సూచించారు.

కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ, పరిశ్రమల అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం హయాంలో కార్మికులను పూర్తిగా విస్మరిచారని ఆరోపించారు. కొన్ని బోర్డులను కూడా రద్దు చేయడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో కొత్త లేబర్ కోడ్స్ వల్ల కార్మికులకు ఎంతో మేలు కలుగుతుందని దీనిపై కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించాల్సి ఉందని, త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కార్మికుల కోసం నిత్యం ఒక కార్మికుడు లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 70 ఏళ్ల వయసులో కష్టపడుతున్నారని ప్ర‌శంసించారు. ఇలాంటి గొప్ప నాయకుడు మనకు దొరకడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పుణ్యమని వాసంశెట్టి సుభాష్ అన్నారు.

Exit mobile version