హైదరాబాద్ : ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం స్వరం మార్చారు. ఆయన ఇప్పుడు పాఠాలు చెప్పడం ఆపేసి సీఎం రేవంత్ రెడ్డిని పొగడటం అనే పనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా జరిగిన కార్యక్రమంలో అంబేద్కర్ యూనివర్శిటీ వీసీ ఘంటా చక్రపాణితో పాటు కాశీం కూడా హాజరయ్యారు. ఈ ఇద్దరూ రేవంత్ రెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతూ వచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రపాణికి ప్రయారిటీ లభించింది. ఆయనకు మంచి పోస్టు ఇచ్చారు మాజీ సీఎం కేసీఆర్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను చేశారు. తన హయాంలోనే గ్రూప్ -2 పరీక్షలు జరిగాయి. ఇందులో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని , సుదీర్ఘ విరామం తర్వాత హైకోర్టు వాటిని కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ తరుణంలో ఉన్నట్టుండి సర్కార్ మారినా తనకు వీసీగా పదవి వచ్చేలా చేసుకున్నారు.
ఇది పక్కన పెడితే ఇప్పుడు వామపక్ష భావజాలం కలిగిన కాశీం ఉన్నట్టుండి రేవంత్ రెడ్డిని భజన చేయడంలో ఫోకస్ పెట్టడంపై విద్యార్థులు విస్తు పోయారు. నిన్నటి దాకా చెప్పింది వేరు ఇప్పుడు తనను ప్రశంసించడం ఎంత వరకు కరెక్టు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఓయూను పట్టించు కోలేదని, మీరు వచ్చాక దీని రూపురేఖలు మారడం ఖాయమని అన్నారు కాశీం. విద్యార్థి లోకం తరపున సీఎంకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని అన్నారు. రేవంతన్న ముందే సీఎం అయి ఉంటే ఈపాటికే ఉస్మానియా దశ తిరిగి ఉండేదన్నారు. పదేండ్ల పాలనలో కేసీఆర్ ఏనాడు ఓయూ వైపు కనీసం కన్నెత్తి చూడలేదని వాపయారు. విద్యార్థి లోకాన్ని శత్రువుల్లా భావించి, యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా, ఉస్మానియాను నిర్వీర్యం చేసే కుట్ర చేశారని ఆరోపించారు.
