హైదరాబాద్ : ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఇంకెంత మందిని చంపుకుంటూ పోతారంటూ ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన హరగోపాల్ నిప్పులు చెరిగారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై. మూలాలను అర్థం చేసుకోకుండా, సమస్యలను పరిష్కరించకుండా మావోయిస్టులను నిర్మూలిస్తూ పోతామని అనుకుంటే పొరపాటు పడినట్లేనని పేర్కొన్నారు. ఆపరేషన్ ఖాగర్ పట్ల ప్రొఫెసర్ హరగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా మావోయిస్టు హిడ్మాను చంపడం పట్ల లక్షలాది ఆదివాసీలు, మేధావులు, జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు, పౌర సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతే కాకుండా దేశ రాజధానిలో ఏకంగా భారీ ఎత్తున హిడ్మాకు మద్దతుగా విద్యార్థులు, మద్దతుదారులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. కేంద్ర సర్కార్ దమనకాండకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్బంగా హరగోపాల్ ఫైర్ అయ్యారు. సాధారణ పౌరులు ఆయుధాలు వాడకూడదని కేంద్ర ప్రభుత్వం చెపుతోందని , మరి మీ చేతిలో ఉన్న రాజ్యాంగం అనే ఆయుధాన్ని వాడి చట్ట విరుద్ధంగా మావోయిస్టు లను ఎన్కౌంటర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతుంటే, వారి సమస్యల గురించి పట్టించు కోకుండా విప్లవాలను అడ్డుకోవడం సరికాదన్నారు. మానవత్వం లేకుండా మావోయిస్టులను నిర్మూలించడం ఎంత వరకు దారి తీస్తుందని ఆలోచించాలన్నారు.
















