ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలను ఉద్దేశించి సోమవారం చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు ఎంపీ ప్రియాంక గాంధీ. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మోదీ ఇలా దిగజారుడు కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారన్న విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు లేవదీసిన ప్రశ్నలకు జవాలు ఇవ్వాల్సిన బాధ్యత నరేంద్ర మోదీపై ఉందన్నారు. దాని నుంచి తప్పించు కోవాలని చూడడం తప్పవుతుందని అన్నారు. తను కొలువుతీరిన కాలంలో ఈ దేశానికి ఏం చేశారో చెప్పాలని ప్రియాంక గాంధీ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా పార్లమెంట్ లో డ్రామాలు వద్దు వాస్తవ సమస్యలను ప్రస్తావించాలని ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీలు. రాజకీయాలలో గెలుపు ఓటములు చాలా సహజమని, ఏదో ఒక రోజు మీరు కూడా ప్రతిపక్షంగా మారాల్సి వస్తుందని , ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు మోదీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ. విపక్షాలు సానుకూల ఆలోచనలతోనే ఉన్నాయని, కానీ మీ బుద్దే వక్రబుద్ది అని, మీరే సక్రమంగా ఆలోచించడం లేదని తేలి పోయిందన్నారు. ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా ఉంటుందన్న సోయి లేకుండా పోతే ఎలా అని నిప్పులు చెరిగారు ప్రధానిపై ప్రియాంక గాంధీ.
