Private Railway Station : భారతదేశంలో రైల్వే వ్యవస్థ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉండగా, దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే ప్రైవేట్ మోడల్‌లో అభివృద్ధి చెంది ప్రత్యేక గుర్తింపు పొందింది. అది మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఉన్న రాణి కమలాపతి రైల్వే స్టేషన్.
ఈ స్టేషన్‌ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో తీర్చిదిద్దారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేట్ మేనేజ్‌మెంట్‌తో నడిచే రైల్వే స్టేషన్‌గా గుర్తింపు పొందింది. అంతేకాదు, విమానాశ్రయానికి ధీటుగా అత్యాధునిక సదుపాయాలతో ఇది ప్రయాణికులకు ప్రపంచ స్థాయి అనుభూతిని అందిస్తోంది.
Private Railway Station – ఏవీ అందుబాటులో ఉన్నాయి?
రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌లో (Rani Kamlapathi Railway Station) ప్రయాణికుల కోసం అనేక ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ముఖ్యంగా:
- 24 గంటల పవర్ బ్యాకప్
- శుద్ధమైన తాగునీటి వసతి
- ఏసీ లాబీలు
- హై-స్పీడ్ ఎస్కలేటర్లు, లిఫ్టులు
- పార్కింగ్ ప్రాంతం
- మల్టీ బ్రాండ్ షాపింగ్ కేంద్రాలు
- ఆటో షోరూమ్‌లు
- కన్వెన్షన్ సెంటర్
- హోటళ్లు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి ఏర్పాటు చేశారు.
పర్యావరణం కోసం ప్రత్యేక చర్యలు
ఈ స్టేషన్‌కు ASSOCHAM సంస్థ అందించిన GEM సస్టైనబిలిటీ 5 స్టార్ రేటింగ్ లభించడం గర్వకారణం. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
శుభ్రత, సౌలభ్యం – ప్రయాణికులకి కొత్త అనుభవం
స్టేషన్ అంతా శుభ్రంగా ఉండేలా నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాణి కమలాపతి స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించినట్లుగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందుతున్నారు.
ఇలాంటి ఆధునిక స్టేషన్ల అభివృద్ధి ద్వారా భారత రైల్వే కొత్త దశలోకి అడుగిడుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి మోడల్‌ను విస్తరించాలన్న దిశగా చర్చలు సాగుతున్నాయి.
Also Read : New York Firing Sensational : న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో కాల్పులు
