Minister Uttam Kumar Reddy Interesting : కొత్త రేష‌న్ కార్డుల పంపిణీకి శ్రీ‌కారం

ఇవాల్టి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ

Hello Telugu - Minister Uttam Kumar Reddy Interesting

Hello Telugu - Minister Uttam Kumar Reddy Interesting

Uttam Kumar Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమ‌వారం నుంచి పెద్ద ఎత్తున కొత్త రేష‌న్ కార్డుల‌ను పంపిణీ చేయనున్నారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి తుంగ‌తుర్తిలో జ‌రిగే కార్య‌క్ర‌మంలో రేష‌న్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడ‌తార‌ని తెలిపారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy). ఎన్నో ఏళ్ల‌కు తాజా స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌న్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త‌గా 5 ల‌క్ష‌ల మందికి రేష‌న్ కార్డుల‌ను ఇవ్వ‌బోతున్న‌ట్లు చెప్పారు.

Minister Uttam Kumar Reddy Comment about New Ration Cards

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రేష‌న్ కార్డుల పంపిణీకి సంబంధించి వివ‌రాలు వెల్ల‌డించారు. త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చాక కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నామ‌న్నారు. పూర్తిగా సామాజిక బాధ్య‌త‌తో కూడిన ప‌థ‌కాల‌ను తీసుకు రావ‌డం జ‌రిగింద‌న్నారు. రేష‌న్ కార్డుల‌కు సంబంధించి కు­టుంబ సభ్యు­ల­ను రే­ష­న్ కా­ర్డు­ల­లో చే­ర్చు­తు­న్నా­మ­ని చె­ప్పా­రు. దీం­తో తె­లం­గా­ణ­లో రే­ష­న్ కా­ర్డుల సం­ఖ్య 94.72 లక్ష­ల­కు చే­ర­నుం­ద­ని ప్ర‌క‌టించారు.

అయితే రేష‌న్ కార్డుల పంపిణీ ఇవాల్టితోనే అయి పోద‌న్నారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. ఇది నిరంత‌రం కొన‌సాగే ప్ర‌క్రియ‌గా ఆయ‌న పేర్కొన్నారు. ఇవాళ ఒక్క రోజే 5 ల‌క్ష‌ల‌కు పైగా రేష‌న్ కార్డులు ఇస్తామ‌న్నారు. ఇది ఓ రికార్డ్ అన్నారు. కార్డుల‌కు సంబఃధించి రూ. 13 వేల కోట్లతో 3.10 కోట్ల మందికి 6 కేజీల స‌న్న బియ్యం ఉచితంగా ఇస్తున్న‌ట్లు చెప్పారు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. బియ్యం పంపిణీ ద్వారా ఆక‌లితో ఎవ‌రూ ఉండ‌ర‌న్నారు. ఇదే ఇందిర‌మ్మ రాజ్యం అన్నారు.

Also Read : Nerella Sarada Interesting Comments : బీసీ రిజ‌ర్వేష‌న్ల అమ‌లు చారిత్రాత్మ‌కం

Exit mobile version