అమెరికా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో అత్యంత కీలకమైన సెంట్రల్ బ్యాంక్ కు చీఫ్ ను నియమించారు. ఈ మేరకు మాజీ ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ కెవిన్ వార్ష్‌ను తదుపరి అమెరికా సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌గా నామినేట్ చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. కెవిన్ వార్ష్ తనకు చాలా కాలం నుంచి తెలుసు అని పేర్కొన్నారు. ఆయన ఈ కీలకమైన పదవికి అన్ని విధాలుగా సరి పోతాడని స్పష్టం చేశారు. అత్యుత్తమమైన సేవలు అందిస్తారనే నమ్మకం తనకు ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ ఫామ్ లో రాశారు.
ఇక కెవిన్ వార్ష్ కు అపారమైన అనుభవం ఉంది ఆర్థిక, బ్యాంకింగ్ రంగానికి సంబంధించి. 2008లో చోటు చేసుకున్న ఆర్థిక సంక్షోభంలో అమెరికాను గట్టెక్కించేందుకు ఫెడ్ గవర్నర్ గా కీలక పాత్ర పోషించారు .
2022లో వడ్డీ రేట్లు పెంచాడు. ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడాడు. కోవిడ్ తర్వాత అమెరికాను కోలుకునేలా చేయడంలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక కెవిన్ వార్ష్ విషయానికి వస్తే తను వార్డ్ జేన్ లాడర్ ను పెళ్లి చేసుకున్నాడు. జేన్ సౌందర్య సాధనాల సంస్థ ఎస్టీ లాడర్‌కు బిలియనీర్ వారసురాలు. ఆమె తండ్రి, అతని మామ, రోనాల్డ్ లాడర్. డోనాల్డ్ ట్రంప్ కు చిరకాల స్నేహితుడు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కు సన్నిహితుడు.

















