అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మేయర్ ఎన్నికల్లో బీసీలకు 35.29 శాతం, మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో 33.02 శాతం, అర్బన్ వార్డులలో 32.78 శాతం సీట్లు బీసీలకు ఇస్తాం అని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్ ఎన్నికల్లో 27.95 శాతం సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 24.6 శాతం, జడ్పీ ఛైర్మన్ ఎన్నికల్లో 23.08 శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే రిజర్వేషన్ల వ్యవహారంపై చుక్కెదురైంది సుప్రీంకోర్టులో సర్కార్ కు. దీంతో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం జరిగిందన్నారు. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తామన్నారు. ఇందులో ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు.
పంచాయతీ వార్డుల్లో బీసీలకు 26.73 శాతం సీట్లు, సర్పంచ్‌ల స్థానాలలో 27.95% , ఎంపీపీల కోసం 24.06 శాతం, జెడ్పీటీసీలకు సంబంధించి 24.6 శాతం, జిల్లా పరిషత్ చైర్మన్ ల కు 23.08 శాతం, మున్సిపల్ చైర్మన్లు 33.02%, అర్బన్ వార్డుల్లో 32.78% , ఇక మేయర్ స్థానాలకు సంబంధించి కీలక ప్రకటన చేవారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మేయర్ల స్థానాలకు బీసీలకు 35.29% సీట్లు కేటాయిస్తామన్నారు. ఇక స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో కీలక సమావేశం నిర్వహించారు ఏపీ ఎన్నికల సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి అనిల్ చంద్ పునీతా. దీంతో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. దీంతో తమ పార్టీ పరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం.


















