Prashant Kishor Shocking Comments : బీహార్ లో నితీష్ కమార్ కు షాక్ త‌ప్ప‌దు

ప‌రిస్థితులు అంత‌గా అనుకూలంగా లేవు

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Prashant Kishor : బీహార్ : ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్, జ‌న్ సురాజ్ వ్య‌వ‌స్థాప‌కుడు ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న పార్టీ స్థాపించినా బ‌రిలోకి దిగాల‌ని అనుకున్నారు. కానీ పోటీ చేయ‌కుండా నిష్క్ర‌మించారు. ప్ర‌స్తుతం బీహార్ లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జరుగుతున్నాయి. ప్ర‌ధానంగా పోటీ ఎన్డీయే కూట‌మి , ఇండియా కూట‌మి మ‌ధ్యే ఉంది. అయితే ఆశించినంత మేర ఎన్డీయే వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం లేద‌ని బాంబు పేల్చారు ప్ర‌శాంత్ కిషోర్. సీఎం గా నితీష్ కుమార్ గ‌డ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నార‌ని పేర్కొన్నారు. ఇది మర్చిపోవద్దన్నారు. ఇప్పుడు బీహార్‌లో 65-67% ఓట్లు అధికార పార్టీకి అనుకూలంగా లేవన్నారు.

Prashant Kishor Slams Nitish Kumar

ఇది సాధ్యం కాదని స్స‌ష్టం చేశారు ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor). ఫలితాలు ఇప్పుడే రానివ్వండి, ఎందుకంటే ఇది చాలా గందరగోళ పరిస్థితి. మీరు శాస్త్రీయ ఎగ్జిట్ పోల్ చేస్తున్నట్లయితే తప్ప. మాట్లాడుతున్న వ్యక్తులు గాలిలో మాట్లాడుతున్నార‌ని ఆరోపించారు. అంచనా గురించి మర్చిపోండి; పోలింగ్ జరుగుతున్న రోజున, ఎవరైనా చాలా అపూర్వమైన పోలింగ్ శాతం కనిపిస్తుందని చెప్పినట్లయితే ఎంత మంది ఓటు వేయబోతున్నారో మీకు తెలియనప్పుడు, వారు ఎవరికి ఓటు వేయబోతున్నారో మీకు ఎలా తెలుస్తుంది అంటూ నిల‌దీశారు పీకే.

అనుభవం ఆధారంగా, మీరు ఏదైనా విశ్లేషిస్తారు. చాలా చోట్ల అది సరే, కానీ దానికి శాస్త్రీయ ఆధారం లేదు. ఎవరైనా శాస్త్రీయ ఎగ్జిట్ పోల్ చేస్తున్నట్లయితే, ఫలితం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

Also Read : PM Modi Interesting Comments : ప్ర‌పంచ ఆధ్యాత్మిక రాజ‌ధానిగా ఉత్త‌రాఖండ్

Exit mobile version