PM Modi Interesting Comments : ప్ర‌పంచ ఆధ్యాత్మిక రాజ‌ధానిగా ఉత్త‌రాఖండ్

రాష్ట్ర స్థాప‌న దినోత్స‌వంలో ప్ర‌ధానమంత్రి

Hello Telugu - PM Modi Interesting Comments

Hello Telugu - PM Modi Interesting Comments

PM Modi : ఉత్త‌రాఖండ్ : రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పని చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం ఉత్త‌రాఖండ్ లో ప‌ర్య‌టించారు మోదీ. ఈ సంద‌ర్బంగా ఇవాళ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం. ఈ కార్య‌క్రమంలో మోదీ (PM Modi) పాల్గొన్నారు. ఇందుకు సంబంధించి పోస్ట‌ల్ స్టాంపును విడుద‌ల చేశారు. ఉత్తరాఖండ్ నవంబర్ 9, 2000న భారతదేశ 27వ రాష్ట్రంగా అవతరించింది. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాపన దినోత్సవంగా నిర్వ‌హంచ‌డం ఆన‌వాయితీగా వస్తోంది. ప్ర‌ధానితో పాటు ముఖ్య‌మంత్రి పుష్క‌ర్ సింగ్ ధామీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంగా ఏర్పాటై 25 ఏళ్లు అవుతోంద‌న్నారు. ప్ర‌జ‌ల క‌ల‌లను సాకారం చేసేందుకు డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని చెప్పారు మోదీ.

PM Modi Comments

ఇదిలా ఉండ‌గా ఈ మైలురాయిని గుర్తు చేసుకునేందుకు గాను పోస్ట‌ల్ స్టాంపును తాను ఆవిష్క‌రించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ప్ర‌ధానమంత్రి. వోకల్ ఫర్ లోకల్ ఉద్యమంతో రాష్ట్రానికి ఉన్న లోతైన సంబంధాన్ని ప్రశంసించారు .ఇది రాష్ట్ర సంప్ర‌దాయంలో భాగంగా ఉంద‌న్నారు. ఉత్తరాఖండ్ ఆధ్యాత్మిక బలాన్ని దాని గుర్తింపు నిజమైన సారాంశంగా ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్రం త్వరలో ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధానిగా మారగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్, జగేశ్వర్ , ఆది కైలాష్ వంటి కీలక తీర్థయాత్ర స్థలాలను మోదీ విశ్వాస చిహ్నాలుగా హైలైట్ చేశారు, ఇవి ఏటా లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తాయని చెప్పారు.

Also Read : CSK Strong Focus on Sanju Samson : శాంస‌న్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఫోక‌స్

Exit mobile version