Prashant Kishor Shocking Comments : ఆ ముగ్గురు నేత‌లు కాలం చెల్లిన మందులు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌శాంత్ కిషోర్

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Prashant Kishor : బీహార్ : జ‌న్ సుర‌క్ష పార్టీ ఫౌండ‌ర్, ప్ర‌ముఖ ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, ఎంపీ రాహుల్ గాంధీ, బీహార్ మాజీ ఉప ముఖ్య‌మంత్రి తేజ‌స్వి యాద‌వ్ ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆ ముగ్గురు నేత‌లు కాలం చెల్లిన మందులు లాంటి వార‌న్నారు. వారి ప‌నై పోయింద‌ని, ఆ ముగ్గురు ఔట్ డేటెడ్ పొలిటిక‌ల్ లీడ‌ర్లు అంటూ ఎద్దేవా చేశారు. బీహార్‌లో తొలిసారిగా ప్రజల్లోకి వెళ్లకపోతే ప్రజలు తమకు ఓటు వేయరని నాయకుల మనస్సుల్లో భయం ఉండటం మంచిదేనని ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor). ఈ ముగ్గురు పేరుకు పోయిన‌ అవినీతిని, నిరుద్యోగాన్ని నిర్మూలించలేరని ఆరోపించారు.

Prashant Kishor Slams

ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత జాతీయ ప్రజాస్వామ్య కూటమి , ఆర్జేడీ నేతృత్వంలోని మ‌హా ఘ‌ట్ బంధ‌న్ మ‌ధ్య ప్ర‌ధాన పోటీ నెల‌కొంది. 243 మంది స‌భ్యులున్న శాస‌న స‌భ‌లో ప్ర‌స్తుతం బీజేపీకి 80 సీట్లు , జేడీయూ 45, హెచ్ఏఎం 4, ఇద్ద‌రు ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌తో క‌లిపి 131 సీట్ల‌ను క‌లిగి ఉంది. ఇక మ‌హా ఘ‌ట్ బంధ‌న్ లో 111 సీట్లు క‌లిగి ఉన్నారు. ఆర్జేడీకి 77 సీట్లు ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి 19, సీపీఐఎంఎల్ కు 11, సీపీఐకి 2 సీట్లు ఉన్నాయి. ఈసారి జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎలాగైనా మ‌హా ఘ‌ట్ బంధ‌న్ గెల‌వాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం ప్రారంభించింది. బీహార్ ప్ర‌జ‌లు మోదీ, రాహుల్ గాంధీ, తేజ‌స్వి యాద‌వ్ ల‌ను న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌ని, వారంతా జ‌న్ సురాజ్ ను న‌మ్ముతున్నార‌ని పేర్కొన్నారు ప్ర‌శాంత్ కిషోర్.

Also Read : Dasoju Sravan Fired on Congress Govt : తెలంగాణ‌లో పోలీసు రాజ్యం న‌డుస్తోంది : దాసోజు

Exit mobile version