Prashant Kishor Shocking Comments : బీహార్ లో జ‌న్ సురాజ్ ఓట‌మికి నాదే బాధ్య‌త

ప్ర‌క‌టించిన పార్టీ అధ్యక్షుడు ప్ర‌శాంత్ కిషోర్

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Hello Telugu - Prashant Kishor Shocking Comments

Prashant Kishor : పాట్నా : జ‌న్ సురాజ్ పార్టీ అధ్య‌క్షుడు , ఇండియ‌న్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాష్ట్రంలో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ స‌ర్కార్ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. ఏకంగా ఎన్డీయే కూట‌మి 203 సీట్ల‌ను కైవ‌సం చేసుకుంది. అంద‌రినీ విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్బంగా రాష్ట్రంలో నూత‌న పార్టీని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాద‌యాత్ర జ‌రిపిన ప్ర‌శాంత్ కిషోర్ (Prashant Kishor) పార్టీ ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. ఈ సంద‌ర్బంగా ఎన్నిక‌ల అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాము నిజాయితీగా ఎన్నిక‌ల బ‌రిలో విజ‌యం సాధించేందుకు ప్ర‌య‌త్నం చేశామ‌ని చెప్పారు.

Prashant Kishor Comments Viral

కానీ ఆశించిన మేర మేము ప్ర‌జ‌ల‌ను మెప్పించ లేక పోయామ‌ని పేర్కొన్నారు. దీనిని అంగీకరించడంలో ఎటువంటి హాని లేద‌న్నారు. వ్యవస్థాగత మార్పు గురించి మరచిపోండి అని అన్నారు ప్ర‌శాంత్ కిషోర్.
తాము అధికారంలో కూడా మార్పు తీసుకు రాలేక పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ బీహార్ రాజకీయాలను మార్చడంలో తాము ఖచ్చితంగా కొంత పాత్ర పోషించడం జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేవారు పీకే. ప్రజలు మమ్మల్ని ఎన్నుకోక పోవ‌డానికి మేము వివరించిన విధానంలో, మా ప్రయత్నాలలో, మా ఆలోచనలో, ఏదో తప్పు జరిగి ఉండాల‌ని చెప్పారు ప్ర‌శాంత్ కిషోర్. ప్రజలు త‌మ‌పై విశ్వాసం చూపకపోతే, దానికి పూర్తిగా బాధ్యత నాదే. బీహార్ ప్రజల విశ్వాసాన్ని నేను గెలుచు కోలేక పోయే బాధ్యతను నేను 100 వాతం నాపైనే తీసుకుంటానని అన్నారు జ‌న్ సురాజ్ పార్టీ అధ్య‌క్షుడు.

Also Read : TTD Important Update : డిసెంబ‌ర్ 30 నుండి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు

Exit mobile version