హైదరాబాద్ : విలక్షణ నటుడు, ప్రజాస్వామిక వాది ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను ప్రశ్నించారనే నెపంతో ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ ను ఆంధ్రప్రేదశ్ సర్కార్ అరెస్ట్ చేసింది. తన అరెస్ట్ పూర్తిగా అక్రమమని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని పేర్కొన్నారు. తనను రాజ్యం చంపగలదేమో కానీ తన ప్రశ్నను చంపలేరని ప్రకటించాడు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ప్రశ్న రావణ్ పై ఉపా చట్టాన్ని నమోదు చేసింది సర్కార్. దీనిపై తీవ్రంగా స్పందించారు నటుడు ప్రకాశ్ రాజ్. యూట్యూబర్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన నేపథ్యంలో, భిన్నాభిప్రాయాలను అణచివేసే ప్రయత్నం జరుగుతోందని నటుడు ఆరోపించారు.
సోషల్ మీడియాలో స్పందించిన ఆయన, నిందితుడు ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ పొందినప్పటికీ UAPAను ప్రయోగించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేసే అవకాశంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భిన్నాభిప్రాయాలను అణచివేయాలనే మీ నిస్సహాయతను లేదా ఆత్రుతను సూచిస్తోంది… ఇకపై ఏం జరగవచ్చు? వ్యక్తిగత సమాచారాన్ని వక్రీకరించి లీక్ చేయడం ద్వారా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారా? అని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి చర్యలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వారిలో భయాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు వేటను ప్రారంభించి” ఉండవచ్చు కానీ చివరికి పౌరులు స్పందిస్తారని అనన్నారు.
ఈ కేసు UAPA వంటి కఠినమైన చట్టాల వినియోగంపై చర్చకు దారితీయడమే కాకుండా, భావప్రకటనా స్వేచ్ఛ విషయంలో పౌర సమాజంలోని కొన్ని వర్గాలలో ఆందోళనలను రేకెత్తించింది.
