నిరాశ ప‌ర్చిన ప్ర‌భాస్ రాజా సాబ్ వ‌సూళ్లు

కేవ‌లం రూ. 9 కోట్లు మాత్ర‌మే వ‌సూళ్లతో ప‌రేషాన్

hellotelugu-TherajaSaab

హైద‌రాబాద్ : పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్, నిధి అగ‌ర్వాల్ , మాళ‌విక మోహ‌న్ , సంజ‌య్ ద‌త్ కీ రోల్ పోషించిన సినిమా ది రాజా సాబ్. ఆశించిన స్థాయిలో ఉండ‌క పోవ‌డంతో విడుద‌లైన రోజు నుంచే నెగటివ్ టాక్ అందుకుంది. దీంతో ప్ర‌భాస్ సినీ కెరీర్ లోనే ఈ మూవీ అతి పెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింద‌ని టాక్. ప్ర‌భాస్ ను డిఫ‌రెంట్ గా ప‌రిచ‌యం చేయాల‌ని అనుకున్నాడు ద‌ర్శ‌కుడు మారుతి. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. క‌థ బాగానే ఉన్నా ఎందుక‌నో పాత్ర‌లు సింక్ కాలేక పోయాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ట్రేడ్ టాక్ దారుణంగా ఉంది. దీంతో ది రాజా సాబ్ వ‌సూళ్లు కేవ‌లం రూ. 9 కోట్లు మాత్ర‌మే వ‌చ్చిన‌ట్లు సినీ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన స‌మాచారం.

అంతే కాకుండా ఈ పేలవమైన ఓపెనింగ్ ట్రేడ్‌ను ఆశ్చర్యపరిచింది. బలమైన ప్రీ-రిలీజ్ హైప్‌ను సృష్టించినప్పటికీ, ప్రభాస్ తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ తెలుగు రాష్ట్రాల్లో నిరాశాజనకమైన వసూళ్లతో ప్రారంభమైంది. ఈ హారర్-కామెడీ చిత్రం మొదటి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అతి త‌క్కువ వ‌సూలు కావ‌డం తో నిరాశ చెందారు మూవీ మేక‌ర్స్. హారర్ కామెడీలో నటుడి ప్రయత్నం అతని ప్రధాన అభిమానులను ఆకట్టుకోలేదని కొంద‌రు డిస్ట్రిబ్యూట‌ర్స్ వాపోయారు. త‌ను కామెడీ పాత్ర‌ల‌కు స‌రిపోడ‌ని, ఉన్న ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ద‌ర్శ‌కుడు చేశాడంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అయితే మూవీ ప్రీ రిలీజ్ సంద‌ర్బంగా ద‌ర్శ‌కుడు చేసిన కామెంట్స్ త‌న‌కు ఇప్పుడు ఇబ్బందిగా మారాయి.

Exit mobile version