ప్ర‌భాస్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో స‌లార్ -2 సీక్వెల్

డార్లింగ్ పుట్టిన రోజు సంద‌ర్బంగా కీల‌క ప్ర‌క‌ట‌న

hellotelugu-Prabhas

హైద‌రాబాద్ : ప్ర‌భాస్ మూవీ గురించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ద‌మ్మున్న ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు ప్ర‌శాంత్ నీల్. త‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్టీఆర్ తో డ్రాగ‌న్ మూవీ చేస్తున్నాడు. గ‌తంలో ప్ర‌భాస్ తో నీల్ స‌లార్ పేరుతో సినిమా తీశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. తాజాగా ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. విజ‌య‌వంత‌మైన స‌లార్ కు కొన‌సాగింపుగా స‌లార్ -2 రాబోతోంద‌ని చిత్ర‌బృందం వెల్ల‌డించింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కలయికలో మరో భారీ యాక్షన్ దృశ్య కావ్యం సిద్ధం కానుంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘సలార్ 2’ చిత్రాన్ని ప్రకటించింది చిత్ర బృందం. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే, విడుదల తేదీకి సంబంధించిన వివరాలను ఇంకా వెల్లడించలేదు. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ ఘనవిజయం తర్వాత, హోంబలే ఫిల్మ్స్ (విజయ్ కిరగందూర్) నిర్మాణంలో ఈ రెండో భాగం రాబోతోంది.

మొదటి భాగంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా , శ్రియ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ఆయన ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టనున్నారు. మరోవైపు, ప్రభాస్ కూడా పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ స్టార్ పవర్, ప్రశాంత్ నీల్ మార్క్ భారీ యాక్షన్ సన్నివేశాలు తోడవనుండటంతో ‘సలార్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన గత చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో, ఈ కొత్త చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండ‌గా ప్రస్తుతం డార్లింగ్ ప్ర‌భాస్ హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఫౌజీలో న‌టిస్తున్నాడు.

Exit mobile version