హైదరాబాద్ : టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రస్తుతం తన తాజా చిత్రం ‘ది పారడైజ్’ విజయంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఈ సినిమాలో ఆయన ఒక కీలక పాత్రలో, కథానాయకుడు నానితో కలిసి పూర్తి నిడివి పాత్రలో కనిపించారు. ఇందులో ఆయన చేసిన శారీరక మార్పులు , గ్లామర్ లేని సహజమైన రూపం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాత్ర ఆయనలోని నటనను మరోసారి నిరూపించడమే కాకుండా, భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలకు మార్గం సుగమం చేసేలా ఉంది. మరోవైపు 2019లో ప్రేక్షకులను అలరించిన సంపూర్ణేష్ బాబు చిత్రం ‘కొబ్బరి మట్ట’ బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న తిరిగి థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన తన పోస్ట్‌లో సాయి రాజేష్, సంపూర్ణేష్ అన్న ‘కొబ్బరి మట్ట’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు. నవంబర్ 14న ఈ సినిమా మళ్లీ విడుదలవుతోంది, అందరూ కలిసి వెళ్లి ఆనందించండి అని పేర్కొన్నారు.
ఈ చిత్రాన్ని ‘అమృత ప్రొడక్షన్స్’ బ్యానర్ ద్వారా తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ విషయాన్ని సంపూర్ణేష్ బాబు కూడా ధృవీకరిస్తూ, తనకు మద్దతు తెలిపిన కిరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తన పోస్ట్‌లో చాలా ధన్యవాదాలు కిరణ్ అబ్బవరం అన్న, మీ ప్రేమకు , మద్దతుకు కృతజ్ఞతలు. నవంబర్ 14న థియేటర్లలో ‘కొబ్బరి మట్ట’ సృష్టించే సందడిని మరోసారి అందరం కలిసి ఆస్వాదిద్దాం అని రాసుకొచ్చారు. కొబ్బరి మట్ట పూర్తి హాస్యభరితమైన చిత్రం . ఇదిలా ఉండగా సంపూర్ణేష్ బాబు పాపారాయుడు, పెదరాయుడు , ఆండ్రాయిడు గా త్రిపాత్రాభినయం చేశారు .
