Amit Shah Challenge : బీహార్ లో మ‌ళ్లీ మాదే అధికారం : అమిత్ షా

ఆర్జేడీపై నిప్పులు చెరిగిన అమిత్ చంద్ర షా

Hello Telugu - Amit Shah Challenge

Hello Telugu - Amit Shah Challenge

Amit Shah : బీహార్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) నిప్పులు చెరిగారు. బీహార్ ఎన్నిక‌ల్లో షాబుద్దీన్ కుమారుడిని నిలబెట్టినందుకు తీవ్రంగా విమ‌ర్శించారు ఆర్జేడీ పార్టీని. 20 ఏళ్లలో అత్యధిక మెజారిటీతో బీహార్‌ను ఎన్డీఏ కైవ‌సం చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. దివంగ‌త‌ గ్యాంగ్‌స్ట‌ర్ , పొలిటిక‌ల్ లీడ‌ర్ షాబుద్దీన్ కొడుకు ఒసామా షాహ‌బ్ కు టికెట్ ఎలా ఇస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇదేనా డెమోక్ర‌సీ అని నిల‌దీశారు. నితీశ్ కుమార్ సార‌థ్యంలోని సంకీర్ణ స‌ర్కార్ గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో అభివృద్ది చేసింద‌న్నారు షా. నేర ప్ర‌వృత్తి క‌లిగిన వారిని ఎన్నిక‌ల్లో నిల‌బెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని మండిప‌డ్డారు. మ‌రోసారి పున‌రాలోచించు కోవాల‌ని సూచించారు. ఇలాంటివి పార్టీల‌కు మంచిది కాద‌న్నారు.

Union Home Minister Amit Shah Challenge

ఎన్నికలు జరగనున్న రాష్ట్రంలోని సరన్ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు అమిత్ షా. .
20 ఏళ్లలో అత్యధిక మెజారిటీతో ఎన్డీఏ రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్య‌క్తం చేశారు. సివాన్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆర్జేడీ షహబ్‌ను ఎలా బ‌రిలో నిల‌బెడుతుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్‌ను ‘అడవి రాజ్యం’ నుండి విముక్తి చేశారని షా ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ ఏడాది బీహార్ వాసులు నాలుగు దీపావ‌ళులు జ‌రుపు కుంటున్నార‌ని చెప్పారు అమిత్ చంద్ర‌షా. బీహార్‌లో చాలా మౌలిక సదుపాయాల పనులు జరిగాయన్నారు. బీహార్‌లోని ఒక మూల నుండి మరొక మూలకు ప్రయాణించడానికి ఐదు గంటలు కూడా పట్టదన్నారు. ఈ అభివృద్ధిని ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలిసి చేశార‌ని అన్నారు.

Also Read : Deputy CM Pawan Kalyan Important Update : చిత్తడి నేలల సంరక్షణ భావితరాలకు అవసరం

Exit mobile version