అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పీ4 విధానం అమలు చేస్తున్నామని, దీని ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తామన్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 2 లక్షల కుటుంబాలకు చేయూత కల్పిస్తామని స్పష్టం చేశారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్స్, విపత్తుల నిర్వహణపై ఫోకస్ పెడతామన్నారు, మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 1035 సేవలు అందిస్తున్నామని తెలిపారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి కేంద్రంగా 3 రీజియన్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు. దాదాపు 90 కేంద్ర పథకాల పునరుద్దరణ చేపడుతున్నట్లు చెప్పారు. రుణాల రీ షెడ్యూల్ తో వడ్డీ తగ్గిస్తామన్నారు నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికి సెమీ కండక్టర్, డిఫెన్స్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11440 కోట్లతో కేంద్రం సాయం చేసిందన్నారు సీఎం. వేగంగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ల నిర్మాణం జరుగుతోందన్నారు. జూలై నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి అవుతుందన్నారు. లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు , విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు గెజిట్ కూడా విడుదల చేసిందన్నారు సీఎం. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామన్నారు. మరో 5 లక్షల మందిని తయారు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. శ్రీ సిటీలో రూ. 5 వేల కోట్లతో ఎల్ జీ, రూ.1000 కోట్లతో క్యారియర్ ఏసీ పరిశ్రమకు శంకుస్థాపన చేశామన్నారు. రూ.5,400కోట్లతో రెన్యూ ఎనర్జీ సంస్థకు, అనకాపల్లిలో రూ.1.35 లక్షల కోట్లతో ఆర్సెలార్ రూ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశామని, దీని ద్వారా వేలాది మందికి జాబ్స్ వస్తాయన్నారు సీఎం.

















