Post Office Interesting Scheme : ఓ అద్భుతమైన పాలసీని తీసుకొచ్చిన పోస్ట్‌ ఆఫీస్‌

ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి పెట్టుబడిదారులకు నష్టం కలిగే అవకాశమే ఉండదు...

Hello Telugu - Post Office Interesting Scheme

Hello Telugu - Post Office Interesting Scheme

Post Office : ప్రతి వ్యక్తి తన పిల్లల భవిష్యత్తు కోసం లేదా కుటుంబ అవసరాల కోసం సురక్షితంగా, రాబడులు అధికంగా ఇచ్చే పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవాలని కోరుకుంటాడు. అటువంటి సందర్భంలో పోస్టాఫీసు (Post Office) పెట్టుబడి పథకాలు అత్యంత విశ్వసనీయమైనవి. ఎందుకంటే ఇవి ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయి కాబట్టి పెట్టుబడిదారులకు నష్టం కలిగే అవకాశమే ఉండదు.

Post Office – పథకం వివరాలు

ఈ పథకం పేరు పోస్ట్‌ ఆఫీస్‌ (Post Office) టర్మ్‌ డిపాజిట్‌ (FD). దీన్ని సాధారణంగా “పోస్టాఫీసు FD” అని కూడా పిలుస్తారు. ఇందులో ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని జమ చేస్తే, ఆపై ప్రతి సంవత్సరం వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీసు 5 సంవత్సరాల టర్మ్‌ డిపాజిట్‌పై 7.5% వార్షిక వడ్డీ అందిస్తోంది. ఇది చాలా బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేట్ల కంటే ఎక్కువ.

5 లక్షలు ఎలా 15 లక్షలవుతాయంటే

అంటే, ప్రారంభంలో పెట్టిన రూ.5 లక్షలు 15 సంవత్సరాలలో రూ.15 లక్షలకు పైగా పెరుగుతాయి. ఈ విధంగా సుమారు రూ.10 లక్షల లాభం ప్రత్యక్షంగా దక్కుతుంది.

ఈ పథకం ప్రయోజనాలు

దీర్ఘకాలికంగా స్థిరమైన, రిస్క్‌ లేకుండా లాభాలు అందించే మార్గాన్ని వెతికే వారికి పోస్టాఫీస్‌ టర్మ్‌ డిపాజిట్‌ ఒక మంచి ఎంపికగా మారింది. ఒక్కసారి చేసిన పెట్టుబడి, సుదీర్ఘకాలంలో భవిష్యత్తు ఆర్థిక భద్రతను కల్పించేలా మారుతోంది.

Also Read : GST Growth : ఒక్క ఆగష్టు నెల 1.86 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

Exit mobile version