Dulquer Salmaan : అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పలు భాషలలో నటించి మెప్పించింది. కొంత గ్యాప్ వచ్చింది తెలుగు మూవీస్ లలో నటించక . తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కీ రోల్ పోషించిన లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించింది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది ఈ లవ్లీ బ్యూటీ. ఐ లవ్ యూ మోనికా అనే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. దీంతో మరోసారి పూజా హెగ్డే వెరీ వెరీ స్పెషల్ గా మారారు.
Dulquer Salmaan – Pooja Hegde New Movie
తాజాగా తన నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే మలయాళ సినీ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తో తెలుగులో ఓ మూవీ రాబోతోంది. ఇందులో ముఖ్య పాత్రకు పూజా హెగ్డేను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ దాదాపు కన్ ఫర్మ్ అయ్యిందని ఇక సంతకం చేసేది మాత్రమే మిగిలి ఉందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది టాలీవుడ్ లో. ఇక పూజా హెగ్డే తన సినీ కెరీర్ ను తమిళ సినిమాలో రంగంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర రంగంలోకి ప్రవేశించింది. ఇక్కడ ఆల్ మోస్ట్ టాప్ హీరోస్ తో కలిసి నటించింది. ఒకానొక సమయంలో తను నెంబర్ వన్ లో ఉండేది. కొంత గ్యాప్ రావడంతో బాలీవుడ్ పై ఫోకస్ చేసింది.
కానీ అక్కడ అంతగా వర్కవుట్ కాలేదు. తను సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్ తో తెర పంచుకున్నా అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతుండడంతో తన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. త్వరలోనే అఫీషియల్ గా సినిమా పేరు , ఇతర నటీ నటుల గురించి ప్రకటన వెలువుడుతుందని టాక్.
Also Read : Hero Prabhas-Neel : హైదరాబాద్ లో ‘ఎఫ్1’ చూసిన ప్రభాస్..ప్రశాంత్ నీల్
