Hero Prabhas-Neel : హైద‌రాబాద్ లో ‘ఎఫ్‌1’ చూసిన ప్ర‌భాస్..ప్ర‌శాంత్ నీల్

సోష‌ల్ మీడియాలో షేక్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్

Hello Telugu - Hero Prabhas-Neel

Hello Telugu - Hero Prabhas-Neel

Prabhas : హైద‌రాబాద్ – పాన్ ఇండియా స్టార్ హీరో ప్ర‌భాస్ (Prabhas), డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ సంచ‌ల‌నంగా మారారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి హైద‌రాబాద్ లో సంద‌డి చేశారు. ప్ర‌సాద్ ఐ మ్యాక్స్ థియేట‌ర్ లో త‌ళుక్కున మెరిశారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎవ‌రికీ తెలియ‌కుండా చ‌డీ చ‌ప్పుడు కాకుండా హాలీవుడ్ కు చెందిన పాపుల‌ర్ మూవీ ఎఫ్ 1 చిత్రాన్ని క‌లిసి చూశారు ఈ ఇద్ద‌రు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైర‌ల్ గా మారాయి.

Prabhas – Prasanth Neel Seen F1 Movie

ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్1 మూవీ రికార్డుల‌ను తిర‌గ రాస్తోంది. కోట్లాది మంది ఈ చిత్రాన్ని చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అమెరికా మొత్తం దీని కోసం నిరీక్షించింది. హాలీవుడ్ లో ఇంతటి భారీ స్థాయిలో ప్ర‌జాద‌ర‌ణ పొందిన చిత్రం ఇప్ప‌ట్లో లేద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఎఫ్1 చిత్రాన్ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జోసెఫ్ కోసిన్స్కీ తీశాడు. ఇందులో టాప్ హీరో బ్రాడ్ పిట్ న‌టించాడు. అద్బుత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు, ఉత్తేజ‌క‌ర‌మైన క‌థ‌తో చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఊపేస్తోంది.

మాజీ ఫార్ములా వ‌న్ డ్రైవ‌ర్ ను అనుస‌రించి తీసిన సినిమా కావ‌డంతో మ‌రింత ఆస‌క్తి రేపింది. డామ్స‌న్ ఇడ్రిస్ పోషించిన పాత్ర గుర్తుండి పోతుంది. కెర్రీ కాండ‌న్, జేవియ‌ర్ బార్డ్ , లూయిస్ హోమిల్ట‌న్ , త‌దిత‌ర భారీ తార‌గ‌ణం ఎఫ్ 1 చిత్రంలో పాలుపంచుకుంది. ఇక ప్ర‌భాస్ తో ప్ర‌శాంత్ నీల్ సాలార్ -1 తీశాడు. ఇది ఇండియ‌న్ సినిమాను షేక్ చేసింది. ప్ర‌స్తుతం పాన్ ఇండియా హీరో వంగా సందీప్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న స్పిరిట్ లో న‌టిస్తున్నాడు. త‌న‌కు జోడిగా యానిమ‌ల్ లో న‌టించి మెప్పించిన త్రిప్తి దిమ్రీని ఎంపిక చేశాడు.

Also Read : Hero Rajinikanth Coolie Movie : కూలీ చిత్రం ర‌జ‌నీకాంత్ భావోద్వేగం

Exit mobile version