Ponnam Prabhakar : హైదరాబాద్ : రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar) నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి కేటీఆర్ పై భగ్గుమన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ పై ఎన్నికల కమిషన్ సుమోటో గా తీసుకొని కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకి 5 వేలు అడుక్కోండి అని మాట్లాడటం, బహిరంగంగా చెప్పడం ఎన్నికల నియమావళికి విరుద్దమని అన్నారు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్బంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఎన్నికల్లో డబ్బులను ఎరగా చూపి , రాజకీయలను భ్రష్టు పట్టించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కు ఉందన్నారు.
Minister Ponnam Prabhakar Slams KTR
ఆ విషయం మరిచి పోయి కేటీఆర్ మాట్లాడటం, నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఓటమి భయంతో నోటికి వచ్చినట్లు ఏవోవే కామెంట్స్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటు కు ఆరు వేలు ఇచ్చిన సంగతి అప్పుడే మరిచి పోయారని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్ గౌడ్. తాము ఇచ్చిన హామీలను అమలు చేశామని, చేసిన అభివృద్ది గురించి ప్రస్తావిస్తూ ముందుకు వెళుతున్నామని, దీనినే తాము ప్రచారం చేస్తున్నామని చెప్పారు మంత్రి . జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగిన వారని, వారికి ఎవరికి ఓటు వేయాలో ఎవరికి వేయ కూడదో స్పష్టమైన అవగాహన ఉందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్,5 00 కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు.
Also Read : Talasani Srinivas Yadav Shocking Comments : రేవంత్ రెడ్డీ భాష మార్చుకోక పోతే బాగుండదు
