Talasani Srinivas Yadav Shocking Comments : రేవంత్ రెడ్డీ భాష మార్చుకోక పోతే బాగుండ‌దు

త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Talasani Srinivas Yadav Shocking Comments

Hello Telugu - Talasani Srinivas Yadav Shocking Comments

Talasani Srinivas Yadav : హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ (Talasani Srinivas Yadav) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. రోజు రోజుకు ప్ర‌జ‌ల‌కు విసుగు పుట్టించేలా, త‌ల దించుకునేలా కామెంట్స్ చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. శ‌నివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాశీబుగ్గ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో జ‌రిగిన తొక్కిసలాటలో చనిపోయిన భక్తులకు సంతాపం తెలిపారు. రేవంత్ రెడ్డి ఇప్ప‌టికైనా మారాలి, త‌న వ‌ల్గ‌ర్ భాష‌ను మార్చు కోవాల‌ని సూచించారు. త‌నకు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్‌కు సిద్ధం కావాలని స‌వాల్ విసిరారు. గ‌త 23 నెలల్లో రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎక్కడ తిరిగారో చెప్పాల‌న్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టడం జ‌రిగింద‌న్నారు. కాంగ్రెస్ కేవలం రూ. 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిన సంగతి మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు.

Talasani Srinivas Yadav Slams CM Revanth Reddy

పోనీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినా కట్టారా అని నిల‌దీశారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. కేటీఆర్ హైదరాబాద్ తిరగలేదని రేవంత్ రెడ్డి అన‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. అస‌లు సీఎం ఇక్క‌డ ఉన్నారా లేక ఇత‌ర దేశంలో ఉన్నారా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. తులం బంగారం, పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డిని ఎక్కడ కట్టేయాలని ఎద్దేవా చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది అని నిరూపిస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. బిఆర్ఎస్ డిమాండ్‌తోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే త‌న‌కు చోటు క‌ల్పించార‌ని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అన్నారు.

Also Read : Beauty Rashmika Mandanna : భిన్న‌మైన పాత్ర‌లు చేయాల‌ని ఉంది

Exit mobile version