పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ ప్ర‌శాంత్ కిషోర్ వైర‌ల్

టీవీకే విజ‌య్ కు 120 సీట్లు వ‌స్తాయ‌ని కామెంట్స్

hellotelugu-PrashantKihsor

పాట్నా : దేశ వ్యాప్తంగా సోమ‌వారం ఐదు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. పుదుచ్చేరిలో బీజేపీ అల‌యెన్స్ ప‌వ‌ర్ లోకి రాగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు చారిత్రాత్మ‌క తీర్పు ఇచ్చారు. అధికారంలో ఉన్న డీఎంకేను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించారు. కేవ‌లం 2 సంవ‌త్స‌రాల కాలంలో ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సంచ‌ల‌నంగా మారింది. 234 సీట్ల‌కు గాను 111 సీట్లు కైవ‌సం చేసుకుని రికార్డ్ సృష్టించారు. ఇదిలా ఉండ‌గా ఈసారి త‌ను ప‌వ‌ర్ లోకి రావ‌డానికి ఎన్నికల వ్యూహ‌క‌ర్త‌గా పేరు పొందిన ప్ర‌శాంత్ కిషోర్ కీల‌కంగా ఉన్నారు. గ‌తంలో డీఎంకే పార్టీకి త‌ను స్ట్రాట‌జిస్ట్ గా ఉన్నారు. ఆ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు వ‌చ్చేలా చేశాడు.

మ‌రో వైపు ఈసారి టీవీకే విజ‌య్ కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌రో వైపు జ‌న్ సుర‌క్ష పేరుతో త‌ను బీహార్ లో పార్టీని ఏర్పాటు చేశాడు. కానీ ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేదంటూ ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య పోయేలా చేశాడు. ఇదిలా ఉండ‌గా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల‌కు సంబంధించి టీవీకే విజ‌య్ పార్టీకి త‌ప్ప‌కుండా 120 సీట్లు ప‌క్కాగా వ‌స్తాయ‌ని, ఈ వీడియోను, నా కామెంట్స్ ను సేవ్ చేసుకుని పెట్టుకోవాల‌ని సూచించారు. ఆయ‌న ఓ ఛాన‌ల్ నిర్వ‌హించిన డిబేట్ లో ఈ స‌వాల్ విసిరారు. త‌ను చెప్పిన‌ట్టే టీవీకే విజ‌య్ ప‌వ‌ర్ లోకి రావ‌డంతో మ‌రోసారి ప్ర‌శాంత్ కిషోర్ దేశ వ్యాప్తంగా వైర‌ల్ గా మారాడు. సోష‌ల్ మీడియాలో విజ‌య్ మాట్లాడిన వీడియోలు, ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేశాయి.

Exit mobile version