PM Modi : ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ తో భారత్ సత్తా ఏమిటో తెలిసి వచ్చిందన్నారు. తను కాళ్ల బేరానికి రావడంతో సిందూర్ ఆపరేషన్ ను అర్ధాంతరంగా ఆపి వేశామన్నారు. ఇవాళ భారత్ అన్ని రంగాలలో టాప్ లో నిలిచిందన్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్బంగా దేశ పౌరులకు ఒక లేఖ రాశారు. ఆపరేషన్ సిందూర్ విజయాలను , నక్సలిజంపై పోరాటాన్ని హైలైట్ చేశారు. ప్రపంచం సంక్షోభాలతో నిండిన సమయంలో భారత్ స్థిరత్వానికి చిహ్నంగా ఉద్భవించిందని నొక్కి చెప్పారు. ప్రధానమంత్రి జిఎస్టి రేట్లను తగ్గించే నిర్ణయాన్ని తన ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయాలలో చేర్చారని తెలిపారు.
PM Modi Key Commenrs on Operation Sindoor
జిఎస్టి బచత్ ఉత్సవ్ సందర్బంగా పౌరులు వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నారని అన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని ప్రోత్సహించడానికి, అన్ని భాషలను గౌరవించడానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి యోగాను స్వీకరించడానికి పౌరులను స్వదేశీ వస్తువులను స్వీకరించాలని కూడా ఆయన కోరారు. ఈ సందర్బంగా ఈ ప్రయత్నాలన్నీ మనల్ని వేగంగా విక్షిత్ భారత్ వైపు తీసుకెళతాయని ఆశా భావం వ్యక్తం చేశారు నరేంద్ర దామోదర దాస్ మోదీ. దీపావళి శుభ సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నానని తెలిపారు. ఇది శక్తి, ఉత్సాహంతో నిండిన పండుగ అని పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం గొప్పగా నిర్మించిన తర్వాత ఇది రెండవ దీపావళి అని అన్నారు పీఎం.
Also Read : Shaheen Shah Afridi Growth : పాకిస్తాన్ వన్డే కెప్టెన్ గా షహీన్ షా అఫ్రిది
















