CSK : చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వచ్చే ఏడాది జరగనుంది. ఇప్పటికే మినీ వేలం పాట నిర్వహణకు సంబంధించి బీసీసీఐ , ఐపీఎల్ గవర్నింగ్ బాడీ కీలక ప్రకటన చేసింది. ఆయా జట్ల యాజమాన్యాలు ఏయే ఆటగాళ్లను ఉంచుకుంటారనే దానిపై వివరాలు ఇవ్వాలని కోరింది. మరో వైపు ఆయా జట్ల మధ్య పరస్పర అవగాహన కూడా వస్తాయి. ఇప్పుడు ఐపీఎల్ లో ప్రధానంగా ఎక్కువగా చర్చకు వస్తున్న పేరు కేరళకు చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్. తను 12 ఏళ్ల పాటు రాజస్థాన్ రాయల్స్ తో అనుబంధం కలిగి ఉన్నాడు. తను మొదట ఢిల్లీ క్యాపిటల్స్ తో పాటు కోల్ కతా నైట్ రైడర్స్ కు వెళ్లాడు. ఆ తర్వాత తను రాజస్థాన్ రాయల్స్ తోనే కీలకమైన అనుబంధం కొనసాగిస్తూ వచ్చాడు. కొన్నేళ్లుగా తను ఆ జట్టులో మిళితమై ఉన్నాడు.
CSK Focus on Sanju Samson
కానీ తాజాగా జరిగిన ఐపీఎల్ లో సంజూ శాంసన్ ను పక్కన పెట్టేలా చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. ప్రధానంగా జట్టులో కీలక భూమిక పోషిస్తున్న జోస్ బట్లర్ ను జట్టు వదులు కోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు. దీంతో శాంసన్ పట్ల ఒకింత దూరం పెరిగిందని సమాచారం. దీంతో ఈసారి తనను జట్టు నుంచి విడిపించాలని కోరాడు. దీంతో తన ధర వచ్చేసి రూ. 18 కోట్లు. ఇదే ధరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో రవీంద్ర జడేజా ఉన్నాడు. మరి ఆ జట్టు తనను వదులుకుంటుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సంజూ శాంసన్ ను తీసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఇప్పటికే సీఎస్కే (CSK) ప్రకటించింది. ఎందుకంటే మహేంద్ర సింగ్ ధోనీ ఏది చెబితే ఆ జట్టుకు శిరోధార్యం. తను ప్రధానంగా శాంసన్ కు గట్టి మద్దతుదారుగా ఉన్నాడు.
Also Read : Minister Damodara Raja Interesting Comments : ప్రజా పాలనకు పట్టం కట్టండి
