ఢిల్లీ : గోవా నైట్‌క్లబ్ అగ్ని ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు .గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ తో పరిస్థితి గురించి మాట్లాడారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. ఈ సంఘటన జరగడం బాధాకరమన్నారు. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నైట్ క్ల బ్ లో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అంతలోనే ఘోరం జరిగి పోయిందని వాపోయారు. హుటా హుటిన అంబులెన్స్ లు, అగ్ని మాపక సిబ్బంది చేరుకున్నారని తెలిపారు సీఎం .
ఇదిలా ఉండగా అర్పోరాలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత గోవాలోని అన్ని క్లబ్‌ల భద్రతా ఆడిట్ కోసం బిజెపి ఎమ్మెల్యే మైఖేల్ లోబో పిలుపునిచ్చారు. ఇందులో ముగ్గురు మహిళలు, 20 మంది పురుషులు ఉన్నారు. ఈ సంఘటన నన్ను కలవరపెట్టింది. 23 మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరు పర్యాటకులు, ఎక్కువ మంది రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో పనిచేస్తున్న స్థానికులు ఉన్నారని తెలిపారు. గోవాలోని అన్ని ఇతర క్లబ్‌లపై భద్రతా ఆడిట్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇది చాలా ముఖ్యమైనది. పర్యాటకులు ఎల్లప్పుడూ గోవాను చాలా సురక్షితమైన గమ్యస్థానంగా భావిస్తారని అన్నారు.
