PM Modi New Innovation : రూ. 12,230 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కామెంట్స్

Hello Telugu - PM Modi New Innovation

Hello Telugu - PM Modi New Innovation

PM Modi : అస్సాం అస్సాంలో రూ.12,230 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆదివారం ప్రారంభించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. రాష్ట్రంలోని నుమాలిగఢ్ రిఫైనరీలో రూ.7,230 కోట్లతో నిర్మించనున్న పెట్రో ఫ్లూయిడైజ్డ్ కాటలిటిక్ క్రాకర్ యూనిట్‌కు కూడా మోదీ శంకుస్థాపన చేశారు. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్‌లో రూ.5,000 కోట్లతో నిర్మించనున్న వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ కు శ్రీ‌కారం చుట్టారు. పెట్రో ఫ్లూయిడైజ్డ్ కాటలిటిక్ క్రాకర్ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి, రెండవ తరం బయోఇథనాల్ ప్లాంట్ వ్యర్థ రహిత సౌకర్యంగా ఉంటుంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

PM Modi Key Updates

ఇది వెదురు మొక్కల‌ అన్ని భాగాలను ఉపయోగించు కుంటుందని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రూ.200 కోట్ల ప్రోత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. నాలుగు ఈశాన్య రాష్ట్రాల నుండి 5 లక్షల టన్నుల ఆకుపచ్చ వెదురును సేకరిస్తుందని చెప్పారు ప్ర‌ధాన‌మంత్రి. దీని వలన 50,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. పాలీప్రొఫైలిన్ ప్లాంట్, విస్తృత శ్రేణి అనువర్తనాలతో ప్లాస్టిక్ తయారీలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ఈ ప్లాంట్ ఏటా 75,000 ప‌ని దినాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంద‌న్నారు. ప్రధానమంత్రి దరంగ్ జిల్లాలోని మంగల్డోయ్‌లో రూ.6,300 కోట్ల విలువైన ఆరోగ్య , మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు పునాది రాళ్ళు వేశారు.

Also Read : PM Modi – Clear Instructions : భారత్ లో తయారైన వస్తువులనే కొనండి- పీఎం మోదీ

Exit mobile version