PM Modi : ఢిల్లీ : ఏపీలో చదువుకున్న ఐటీఐ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా టాప్ లో నిలిచారు. ఈ సందర్బంగా సదరు విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానోత్సవ కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విజేతలకు , టాపర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు . అనంతరం వారిని ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకు రావాలని పిలుపునిచ్చారు. జీవితంలో ఉన్నత స్థానం పొందేందుకు మరింతగా కష్టపడాలని సూచించారు. ఏదైనా కృషి చేస్తేనే సాధ్యం అవుతుందని, అనుకున్న పని మన దరి చేరుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ.
PM Modi Key Comments
ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ కు కీర్తి ప్రతిష్టలు తెచ్చినందుకు విజేతలందరినీ లోకేష్ స్పెషల్ గా అభినందనలతో ముంచెత్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కౌశల్ దీక్షాంట్ సమరోహ్”లో ప్రధానమంత్రి విద్యార్థులను సత్కరించారు. అఖిల భారత ఐటీఐ పరీక్షలకు హాజరైన ఏపీకి చెందిన ముగ్గురు విద్యార్థులకు ప్రధాని టాపర్ ర్యాంక్ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. హెచ్‌ఆర్‌డి మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టిన విద్యలో సంస్కరణల వల్ల ప్రయోజనం పొందిన ఏపీకి చెందిన 17 మంది ఐటీఐ విద్యార్థులలో పి. మధులత (ఆర్‌అండ్‌ఏసీ టెక్నీషియన్), డి. వందన (పెయింటర్ జనరల్), ఎస్. యామిని వరలక్ష్మి (వుడ్‌వర్క్ టెక్నీషియన్) అనే ముగ్గురు విద్యార్థులు ఉన్నారు.
జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో సహకారం ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఆచరణాత్మక శిక్షణను పరిశ్రమ అవసరాలతో అనుసంధానించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, తద్వారా విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడగలరని అన్నారు నారా లోకేష్. లాభదాయకమైన వేతనాలతో ఉత్తమ ఉద్యోగాలను పొందగలరని ఏపీ మంత్రి అన్నారు.
Also Read : Pattabhirama Swamy Temple Interesting Update : అంగరంగ వైభవోపేతంగా పవిత్రోత్సవాలు


















