PM Modi Diwali Celebrations Interesting : నేవీ సిబ్బందితో ప్ర‌ధాని మోదీ దీపావ‌ళి

వేడుక‌లు జ‌రుపు కోవ‌డం ఆనందంగా ఉంది

Hello Telugu - PM Modi Diwali Celebrations Interesting

Hello Telugu - PM Modi Diwali Celebrations Interesting

PM Modi : న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సోమ‌వారం దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్బంగా దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ (PM Modi) ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక‌లో నేవీ సిబ్బందితో క‌లిసి మోడీ దీపావళిని జ‌రుపుకున్నారు. ఆయ‌న ప్ర‌తి ఏటా భార‌త భ‌ద్ర‌తా ద‌ళంలో కీల‌క పాత్ర పోషిస్తున్న వారితో జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఇక‌ 262 మీటర్ల పొడవున్న ఐఎన్ఎస్ విక్రాంత్ దాదాపు 45,000 టన్నుల బ‌రువు క‌లిగి ఉంది. గ‌తంలోని నౌక కంటే మ‌మ‌రింత పెద్ద‌ది కావ‌డం విశేషం. ఈ నౌక మొత్తం నాలుగు గ్యాస్ టర్బైన్ల ద్వారా శక్తిని పొందుతుంది. గరిష్టంగా 28 నాట్ల వేగాన్ని కలిగి ఉంటుంది. మొత్తం రూ. 20,000 కోట్ల ఖర్చుతో నిర్మించబడింది ఈ ప్రాజెక్టు. ర‌క్ష‌ణ‌ మంత్రిత్వ శాఖ , సీఎస్ఎల్ మ‌ధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి.

PM Modi Diwali Celebrations

మూడు దశల ఒప్పందంలో పురోగతి సాధించింది. ఇది వరుసగా మే 2007, డిసెంబర్ 2014 , అక్టోబర్ 2019లో ముగిసింది. ఈ నౌక కు ఫిబ్రవరి 2009లో శంకుస్థాపన చేశారు. తరువాత ఆగస్టు 2013లో ప్రారంభించారు. మొత్తం మీద 76 శాతానికి పైగా స్వ‌దేశీయంగా త‌యారు చేశారు ఐఎన్ఎస్ విక్రాంత్ ను. మేక్ ఇన్ ఇండియా చొర‌వ‌తో దీనిని చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశానికి నిజ‌మైన దీపావ‌ళి మీతో జ‌రుపు కోవడం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు . ఇదిలా ఉండ‌గా ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ దీపావ‌ళి పండుగ‌ను జ‌రుపుకున్నారు. ఈ సంద‌ర్బంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. స్వీట్లు పంపిణీ చేశారు.

Also Read : Gold Rate Sensational : మోయ‌లేని భారం కొండెక్కిన బంగారం

Exit mobile version