Justice Verma : ఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది ఢిల్లీలో ఉంటున్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు పెద్ద ఎత్తున దగ్ధం కావడం, లభించడం. దీనిపై చర్చ కూడా జరిగింది. పార్లమెంట్ లో విస్తృతంగా ఈ అంశంపై రాద్దాంతం చోటు చేసుకున్నా ఇప్పటి వరకు తనపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. తనను సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అక్కడ తన రాకను తాము ఒప్పుకోమంటూ బార్ అసోసియేషన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఉన్న చోటనే యశ్వంత్ వర్మను (Justice Verma) మార్చారు.
Justice Verma Case Updates
తనపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. సోషల్ మీడియాలో ఇలాంటి జస్టిస్ లు ఉండడం సిగ్గు చేటు అంటూ మండిపడ్డారు నెటిజన్లు. తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో కొత్తగా పిటిషన్ దాఖలైంది. న్యాయవాది మాథ్యూస్ జె. నెడుంపారా, ఇతర సహ-పిటిషనర్లతో కలిసి, జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసం నుండి భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంఘటనకు సంబంధించి దావా దాఖలు చేశారు. కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
మార్చి 14న అగ్నిమాపక దళం మంటలను ఆర్పడానికి అక్కడికి వెళ్లిన తర్వాత, న్యూఢిల్లీలోని తన బంగ్లాకు అనుబంధంగా ఉన్న స్టోర్‌రూమ్‌లో భారీ కాలిపోయిన నగదు కుప్పను కనుగొన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ. గత మే నెలలో, జస్టిస్ వర్మపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోరుతూ అదే పిటిషనర్లు దాఖలు చేసిన ఇలాంటి పిటిషన్‌ను స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
Also Read : YS Jagan Fired on CM Chandrababu : చంద్రబాబు ప్రచారానికి ఎక్కువ పనికి తక్కువ
















