Perni Nani : అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని (వెంకట్రామయ్య) నిప్పులు చెరిగారు. ఆయన ఏపీ సర్కార్ పై, ప్రధానంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన పేర్ని నాని (Perni Nani) సీరియస్ కామెంట్స్ చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పితే తండ్రీ కొడుకులు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు చేకూరిన పాపాన పోలేదన్నారు. కొలువు తీరిన నాటి నుంచి నేటి వరకు వైసీపీని, తమను, తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకోవడం, కామెంట్స్ చేయడమే ఒక పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు పేర్ని నాని.
Perni Nani Slams IT Minister Nara Lokesh
ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మంచి పాలన అందించమని, కానీ వైసీపీని , నేతలను తిట్టడం కాదన్నారు. ఈ విషయం నారా లోకేష్ గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. పరామర్శలకు వెళ్తే వెళ్లారు ఎవరినీ చంపకుండా రా జగన్ అని లోకేష్ అంటున్నాడని మండిపడ్డారు. ఒక మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు పేర్ని నాని. మనుషులను చంపే దుర్మార్గమైన అలవాటు మీకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కందుకూరులో ఓట్లు అడుక్కోవడానికి వెళ్లి 7, 8 మందిని పొట్టన బెట్టుకున్న చరిత్ర మీదని అన్నారు. ఆ విషయం జనం మరిచి పోయారని అనుకుంటే పొరపాటు అన్నారు. గుంటూరులో పేదలకు చీరల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు చనిపోలేదా అని నిలదీశారు. ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు.
Also Read : Election Commission Shocking Restrictions : జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఎన్నికల సంఘం సూచనలు
